BigTV English

Pushpa 2: పుష్ప-2లో రామ్‌చరణ్‌!.. బావా-బామ్మర్దుల డబుల్ ధమాకా!!

Pushpa 2: పుష్ప-2లో రామ్‌చరణ్‌!.. బావా-బామ్మర్దుల డబుల్ ధమాకా!!

Pushpa 2: పుష్ప. పుష్పరాజ్. తగ్గేదేలే. సినిమా అయినా, రికార్డులైనా, కలెక్షన్లు అయినా. పాన్ ఇండియా షేక్ కావాల్సిందే. పుష్ప పార్ట్ 2 సైతం అదే రేంజ్ లో రాబోతోంది. ఫస్ట్ పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా.. అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు.


లేటెస్ట్ గా పుష్ప 2 గురించి మరింత ఆసక్తికర విషయం ఒకటి వైరల్ అవుతోంది. మూవీలో గెస్ట్ రోల్ గా రామ్ చరణ్ నటించబోతున్నట్టు టాక్. బావాబామ్మర్దులు బన్ని, చరణ్ లు ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఫ్యాన్స్ కు డబుల్ ధమాకానే.

పుష్ప స్క్రీన్ ప్లే హై లెవెల్ లో ఉంటుంది. పక్కా మాస్ మసాలా కమర్షియల్ మూవీ. అందులో రామ్ చరణ్ సైతం నటిస్తే..? ఓ వైపు అల్లు అర్జున్, ఇంకోవైపు రామ్ చరణ్. మామూలుగా ఉండదు వాళ్లతోని. గతంలో ‘ఎవడు’ మూవీలో వాళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు.


ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. పుష్ప 2లో కనిపించనున్నారంటే మూవీపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పక్కా. డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో రామ్ చరణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నారట.

రంగస్థలం నుంచే సుక్కు, చరణ్ ల మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే, సుకుమార్ అడగ్గానే రామ్ చరణ్ సైతం ఓకే చేశారని తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక్కరే కాదు.. పుష్ప 2లో పలువురు పాన్ ఇండియా స్టార్స్ కనిపించనున్నారని లీకులు వస్తున్నాయి.

పుష్ప పార్ట్ 1 మాదిరే ‘పుష్ప-2’లోనూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చాలానే ఉంటాయని అంటున్నారు. తాజాగా, ఓ డైలాగ్ నెట్టింగ వైరల్ అవుతోంది. “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్పరాజ్‌ వచ్చాడని అర్థం”.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×