BigTV English
Advertisement

NASA : ఆర్టెమిస్ 1 మిషన్ సక్సెస్… భూమికి తిరిగొచ్చిన ఓరియన్ క్యాప్సూల్

NASA : ఆర్టెమిస్ 1 మిషన్ సక్సెస్… భూమికి తిరిగొచ్చిన ఓరియన్ క్యాప్సూల్

NASA : చంద్రుడిపైకి నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 1 మిషన్ సక్సెస్ అయింది. ప్రయోగించిన తర్వాత 25 రోజులకు ఓరియన్ క్యాప్సూల్ విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చింది. ఓరియన్ క్యాప్సూల్ చంద్రుడిపైన 127 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చింది. ఇది తన ప్రయాణంలో చంద్రుడి ఉపరితలం ఫొటోలను, వీడియోలను చిత్రీకరించింది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం నుంచి పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది. స్కిప్ ఎంట్రీ అనే కొత్త ల్యాండింగ్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సముద్రంలో దిగేలా చేశారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత వేడిని తగ్గుకోడానికి వీలుగా దానికి హీట్ షీల్డ్ ను అమర్చారు. గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి దూసుకొచ్చింది ఓరియన్ క్యాప్సూల్. ఇది ధ్వనివేగం కంటే 30 రెట్లు ఎక్కువ. వేగాన్ని తగ్గించి సముద్రంలో దిగేలా చేయడానికి దానికి కొన్ని పారాచ్యూట్ లను అమర్చారు. భూవాతావరణంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఆ పారాచూట్లు తెరుచుకోవడంతో క్రమంగా ఓరియన్ క్యాప్సూల్ వేగం తగ్గుతూ వచ్చి సముద్రంలో సురక్షితంగా దిగింది. గమ్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ లో మనుషులను పోలిన మూడు బొమ్మలను పంపించారు. చంద్రుడిపై అపోలో ప్రయోగం తర్వాత 50 ఏళ్లకు చేపట్టిన ఆర్టెమిస్ 1 మిషన్ సక్సెస్ అయిందని నాసా ప్రకటించింది. ఇక 2024లో ఆర్టెమిస్ 2, 2025లో ఆర్టెమిస్ 3 ప్రయోగాలు చేపట్టడానికి నాసా సిద్ధమవుతోంది.
2024లో ఆర్టెమిస్ 2 ను ప్రయోగించనుంది నాసా. అందులో నలుగురు వ్యోమగాములను పంపిస్తారు. అయితే వారంతా చంద్రుడిపై కాలుమోపకుండా మూన్ ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో జాబిల్లిని చుట్టి వస్తారు. ఇది సక్సెస్ అయితే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యధిక దూరంగా రికార్డులకు ఎక్కనుంది. అది కూడా సక్సెస్ అయితే… 2025లో ఆర్టెమిస్ 3 ప్రయోగం చేపడతారు. అందులో ఒక మహిళతోపాటు నలుగురు ఆస్ట్రోనాట్స్ ని జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పంపిస్తారు. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అయిందంటే చంద్రుడిపై మనిషి నివాసానికి మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×