E-Paper
Advertisement

Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ!?.. ఏది రియల్? ఏది వైరల్?

Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ!?.. ఏది రియల్? ఏది వైరల్?
Advertisement

Revanth Reddy: “రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ పేరు ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ’. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది”. సోషల్ మీడియాలో ఇప్పుడిదే వైరల్ న్యూస్. శంకర్ అనే వ్యక్తి పెట్టిన పోస్టు.. గంటల వ్యవధిలోనే తెగ సర్క్యులేట్ అయింది. కాంగ్రెస్ ను షేక్ చేసే స్థాయిలో ఆ న్యూస్ కాంట్రవర్సీగా మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. ఆ పోస్ట్ మాత్రం చేయాల్సినంత డ్యామేజ్ చేసేసింది. ఇంతకీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా? ఆ పార్టీ పేరు అదేనా?

కామెడీ కాకపోతే ఇంకేంటి? తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డినే బాస్. రాహుల్ గాంధీ దగ్గర మంచి ఇమేజ్. అధిష్టానం రేవంత్ రెడ్డిలో మరో వైఎస్సార్ ను చూస్తోంది. ఇటీవలే దిగ్విజయ్ సింగ్ సైతం ఇదే విషయం చెప్పి వెళ్లారు. కాంగ్రెస్ లో కింగ్ లా ఉన్న రేవంత్ రెడ్డికి.. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? గ్రామగ్రామాల్లో ఇప్పటికీ పార్టీ కేడర్ పటిష్టంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ కంటే సంస్థాగతంగా ఎంతో మెరుగైన స్థానంలో ఉంది. అలాంటి కాంగ్రెస్ ను వీడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏంటి? అసలు కొత్త పార్టీ ఆలోచనే ఎందుకు చేస్తారు?

Advertisement

జాగ్రత్తగా చూస్తే.. ఇదంతా పక్కా ప్లాన్డ్ గా జరుగుతున్న రాజకీయ కుట్రగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్లు తిరుగుబాటు చేశారు. హైకమాండ్ ఆ విషయాన్ని డీల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేయడంలో భాగంగానే ఈ దుష్ప్రచారం అంటున్నారు. అసలు శంకర్ అనే వ్యక్తికి.. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ విషయం ఎలా తెలుస్తుంది? సీఎం కేసీఆర్ కే తెలీదు కానీ, ఆ శంకర్ కు ఎలా తెలుస్తుందా? ఫేక్ పోస్ట్ కాకపోతే ఇంకేంటి?

శంకర్ తో పోస్ట్ పెట్టించి.. కాంగ్రెస్ లో మరింత కల్లోలం తీసుకురావాలనేది కుట్రదారుల ఎత్తుగడగా తెలుస్తోంది. రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ లీకులిచ్చి.. కేడర్ ను కన్ఫ్యూజ్ చేసేసి.. కాంగ్రెస్ ను ఆగమాగం చేయాలనే కుట్ర దాగుందని అంటున్నారు. ఇదంతా బీఆర్ఎస్సో, బీజేపీనో చేయిస్తోందని.. లేదంటే కాంగ్రెస్ లోని కుట్రదారులు సైతం ఇలా ఫేక్ పబ్లిసిటీ చేయించే ఛాన్సెస్ ఉన్నాయని అనుమానిస్తున్నారు. అందుకే, వీహెచ్ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఎలాగైనా రేవంత్ ను, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే.. ఇలా కొత్త పార్టీ న్యూస్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

Big Stories

Advertisement
×