
Pawan Kalyan: సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య సినిమాలు రావడం ఏమోగానీ, ఇండస్ట్రీలో చాలా మంది నలిగిపోతున్నారు. హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అయితే ఆల్రెడీ హాఫ్ బేక్.. ఆ సినిమాకు ఎన్నిరోజులు ప్రచారం చేయాలి? ఈ సినిమాకు ఎన్ని రోజులు ప్రచారం చేయాలి అని ఆల్రెడీ లెక్కలేసుకుంటున్నారేమో. టెక్నీషియన్లు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉండొచ్చు. వాళ్లందరికన్నా ముందు మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం సతమతమవుతుంటారన్నది అందరూ ఒప్పుకునే విషయం.
మైత్రీ మూవీ మేకర్స్ లో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ చేస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్‌ని ఛీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారన్నది వైరల్ అవుతున్న వార్త.
రీసెంట్‌గా బాలయ్యబాబు ఆహా షో అన్‌స్టాపబుల్‌కి వచ్చారు పవన్ కల్యాణ్. ఈ ఎపిసోడ్ షూట్ గురించి ఆల్రెడీ ఆసక్తి మొదలైంది. అక్కడికి గెస్ట్ అయిన పవన్ కల్యాణ్, మాటల్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌కి ఈవెంట్‌గా వస్తానని అన్నారా? అనేది మరో ఇంట్రస్టింగ్ డిస్కషన్.
మైత్రీ మూవీ మేకర్స్ లో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాకు డైరక్షన్ చేస్తున్నారు. ఈ చనువుతోనే నిర్మాతలు వీరసింహారెడ్డికి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించారట. పవన్ కూడా రావడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమాకు పవన్ కల్యాణ్ ఛీఫ్ గెస్ట్ గా వస్తే, మరి చిరంజీవి సినిమాకు ముఖ్య అతిథి ఎవరనే ఆరాలు అప్పుడే మొదలయ్యాయి. ఒకరిని మించి రీతిలో మరొకరికి అరేంజ్‌మెంట్స్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది మైత్రీ మూవీ మేకర్స్ కి.
సంక్రాంతికి బాలయ్యకి ఛీఫ్ గెస్ట్ గా వచ్చే పవన్, తన అగ్రజుడికి ఏ విధంగా సాయపడతారో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక.
Peddireddy comments: స్టేలకు కాలం చెల్లింది.. చంద్రబాబుపై మరిన్ని కేసులు..పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్..