BigTV English

Janwada Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. విజయ్‌కి లుకౌట్ నోటీసులు

Janwada Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. విజయ్‌కి లుకౌట్ నోటీసులు

Janwada Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సైలెంట్ అయిన కేసులో మళ్లీ కదలిక మొదలైందా? ఫోన్ ట్యాపింగ్ కేసు మాదిరిగా  ఈ కేసు డిలే అవుతుందని పోలీసులు భావించారా? అందుకే మద్దూరి విజయకి లుకౌట్ నోటీసులు ఇచ్చారా? ప్రభాకర్ మాదిరిగా విజయ్ దేశం విడిచి పోతాడనే అనుమానాలు పోలీసులకు ఎందుకొచ్చింది?


జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిలా పీఎస్‌లో NDPC సెక్షన్ కింద కేసు మద్దూరి విజయ్‌పై కేసు నమోదు అయ్యింది. దీంతో కొద్దిరోజులపాటు పోలీసులు సైలెంట్ అయ్యారు.

ఈ కేసులో నిందితుడిగా విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. విదేశాలకు పారిపోయే అవకాశముందన్న సమాచారంతో విజయ్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.


ఈ కేసులో విచారణ జరుగుతుండడంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేయన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ఇంతకీ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు? ఆయన ఫోన్ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడట. పట్టుబడిన రోజు తన ఫోన్ కాకుండా, మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు అందజేశాడు. దీనిపై మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విజయ్ ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ కాకుండా ముందగా న్యాయస్థానాన్ని సంప్రదించాడు. విచారణకు సహకరించకుండా మరో దేశానికి వెళ్తాడనే సమాచారం పోలీసులకు వచ్చింది. విదేశీ మద్యం కొనుగోలు, డ్రగ్స్‌పై ఎవరి దగ్గర తీసుకున్నాడనేది తేలితే ఈ కేసు ముగింపు రావడం ఖాయమని అంటున్నారు.

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×