Ghaati : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సౌత్ క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక టైమ్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కానీ ‘బాహుబలి’ తరువాత ఇప్పటిదాకా ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఆ క్షణం కోసమే ఈ ఆన్ స్క్రీన్ జోడీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ‘ఘాటి’ (Ghaati) మూవీ సెట్ లో పభాస్ కన్పించారు అనేదే ఆ వార్త సారాంశం.
తాజా సమాచారం ప్రకారం రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి’ (Ghaati) సెట్స్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. ‘భాగమతి’ తర్వాత అనుష్క సినిమా సెట్స్‌కి ప్రభాస్ రావడం ఇది రెండవసారి అని చెబుతున్నారు. అయితే ప్రభాస్ నిజంగా ‘ఘాటి’ సెట్స్‌ను సందర్శించాడా ? లేక అనుష్క సినిమాలో ఏదన్నా స్పెషల్ రోల్ లో మెరవబోతున్నాడా? రెండూ కాకుండా ఇవన్నీ కేవలం పుకార్లేనా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అనుష్క – ప్రభాస్ ల హిట్ కాంబో మరోసారి జోడీ కడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ పెళ్లి పుకార్లకు దారి తీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ఏకంగా అనుష్క- ప్రభాస్ లకు పెళ్లి చేసేసి, పిల్లలు కూడా ఉన్నట్టు ఏఐతో ఇమేజస్ ను క్రియేట్ చేశారు. కానీ తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ చాలాసార్లు చెప్పారు ప్రభాస్ – అనుష్క.
కాగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘ఘాటీ’ (Ghaati) చిత్రాన్ని అనుష్క శెట్టి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. రమ్య కృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ రీసెంట్ గా హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మేకర్స్ ప్రకటించిన 3 సినిమాల భారీ డీల్ తో వార్తల్లో నిలిచారు. 2026, 2027, 2028లలో ఈ బ్యానర్ లో ప్రభాస్ చేయనున్న సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి ‘సలార్ 2’ కాగా, దర్శకులు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్‌లతో కలిసి పని చేసే మరో రెండు ప్రాజెక్టుకు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. ఈ హారర్-కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ‘ది రాజా సాబ్’ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉంది. ఇంకా ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన పీరియాడికల్ వార్ సినిమా కోసం కూడా సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటీష్ ఇండియా ఆర్మీకి చెందిన సైనికుడిగా కనిపిస్తాడని భావిస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రభాస్ ‘స్పిరిట్’ అనే కాప్-యాక్షన్ చిత్రం చేయనున్నారు.