సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla)తాజాగా నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). నల్లపనేని యామిని సమర్పణలో శ్రీ లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోకు గల్లా హీరోగా, వారణాసి మానస (Varanasi Manasa) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ , ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
దేవకీ నందన వాసుదేవ.. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికతను పొందుపరిచినట్టు చూపించారు. ముఖ్యంగా హై అండ్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులలో సరికొత్త జోస్ నింపారు అని చెప్పవచ్చు. పాపం పెరిగే కొద్దీ దైవభక్తి పెరుగుతుంది అని ఇప్పటికే ఎన్నో పురాణాలలో చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా సినిమాలో కూడా అదే తరహాలో వస్తూ ఉండడం గమనార్హం. ఈమధ్య కాలంలో ఎక్కడో ఒకచోట దేవుడు, మహిమలు, విశ్వరూప దర్శనాలు చాలా సినిమాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవకీ నందన వాసుదేవ సినిమా కూడా ఆ తరహాలోనిదే.
ఇక టైటిల్ కి తగ్గట్టుగా శ్రీకృష్ణుడు జన్మ వృత్తాంతంతో ముడిపడిన కథ ఇది అని ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి కథను పూర్తిగా సోషలైజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈనెల 14వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం వెనక్కి వెళ్లి ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే.. ముందే చెప్పినట్టు హీరో- విలన్ పాత్రలు కృష్ణుడు – కంశుడిని పోలి ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ల మధ్య పగ, ప్రతీకారం, పంతం అన్నీ కూడా తెరపై చూపించారు. ఇక క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం బోనస్ గా చూపించారు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇకపోతే ఇందులో వారణాసి మానస, అశోక్ గల్లా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక లవ్ స్టోరీ కి మైథాలజీ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమాకి కథ అందించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అశోక్ గల్లా లుక్స్ చాలా మాసీగా కనిపించాయి. వారణాసి మానస ఈ సినిమాతో తొలిసారి తెలుగుతరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఆయన అందించిన పాటలలో “ఏమైందే ఈ గుండెకు” అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. అంతేకాదు ఇటీవల “బంగారం” అనే లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ఝాన్సీ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. దేవదత్త గజానన నాగే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కొడుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.