E-Paper
Advertisement

Kavitha: 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ? రాహుల్ గాంధీని నిలదీసిన కవిత

Kavitha: 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ? రాహుల్ గాంధీని నిలదీసిన కవిత
Advertisement

Kavitha: స్వేచ్ఛ, బ్యూరో: ఎస్సీ ల్లో ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కోరారు. ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ వారికి రిజర్వేషన్లు దక్కాలన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో  ఎస్సీ ఉప కులాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సిన అవసరముందన్నారు. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో స్పష్టం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలోకేంద్రం చేపట్టే జనగణన లెక్కల కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. రిజర్వేషన్ ల పెంపునకు అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాలతో కలిసి జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. ఎస్సీ ఉప కులాల్లో కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also ReadNikhil Siddharth: ఆల్ఫా మేల్ కల్చర్ పై నిఖిల్ సిద్ధార్థ ..తెలుగు సినిమా పైన ఉన్న విమర్శల గురించి ఏమన్నారంటే..!

2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ

Advertisement

తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణ యువతను పచ్చి దగా చేశారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం హైదరాబాద్ కు వస్తున్న ఆయనను నిలదీశారు. మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన నిరుద్యోగుల గోడు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు వారంతా శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలను, ఆకాంక్షలను చిదిమేశారంటూ రాహుల్ గాంధీ పై మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ ను బోగస్ చేశారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అంటనే మోసం, వంచన అన్న దాన్ని మరోసారి నిరూపించారన్నారు. ఉద్యోగాలిస్తామన్న మీ మాటను నిలబెట్టుకోమంటే పోలీసులతో అణిచివేస్తారా? రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ గుర్తు పెట్టుకోండని హెచ్చరించారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే…నిరుద్యోగులంతా కాంగ్రెస్ కచ్చితంగా కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు. రాహుల్ గాంధీని అడ్డుకుంటారన్న నెపంతో తెలంగాణలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేయటాన్ని కల్వకుంట్ల కవిత ఖండించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సింది పోయి…అర్ధరాత్రి నిరుద్యోగులను, జాగృతి కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయటం దుర్మార్గమని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Also Read: Central Bank of India: లక్షకు పైగా జీతం.. సీబీఐ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్, మీకు ఈ అర్హత ఉందా..?

Related News

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Big Stories

Advertisement
×