E-Paper
Advertisement

Viral Video: రెండు సార్లు రైలు నుంచి కింద పడింది.. చివరికి, మూడోసారి..

Viral Video: రెండు సార్లు రైలు నుంచి కింద పడింది.. చివరికి, మూడోసారి..
Advertisement

Dramatic Railway Incident: రైల్వే ప్రయాణీకులు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు పదే పదే చెప్తూనే ఉంటారు. ప్రయాణీకులు చేసే పొరపాట్లు ప్రమాదాలకు ఎలా కారణం అవుతాయి? ప్రాణాలు ఎలా పోతాయి? అనేది పలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. రైలు రన్నింగ్ లో ఉండగా దిగుతూ, ఎక్కుతూ పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రెండు సార్లు పడిపోయింది. మూడోసారి కష్టం మీద ఎక్కింది. తృటిలో రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఇంతకీ అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే?

తాజాగా ఓ మహిళ రైలు కదులుతుండగా ఎక్కేందుకు ప్రయత్నించింది. మెట్ల మీద ఉండగా స్లిప్ అయ్యి పడిపోయింది. కాస్త అటు ఇటు అయినా, ప్లాట్ ఫారమ్, రైలు మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయేది. పడి లేచిన తర్వాత మరోసారి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా సరిగా ఎక్కలేకపడిపోయింది. ఆమె సంచి మాత్రం రైల్లోనే ఉండిపోయింది. అప్పటికే కొంత మంది యువకులు అక్కడికి చేరారు. అయినా ఆమె మరోసారి ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పుడు కాస్త రైలు లోపలికి వెళ్లింది. అయినా పడిపోయే పరిస్థితి రావడంతో లోపల ఉన్న వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకుని పడిపోకుండా ఆపాడు. మొత్తంగా రెండుసార్లు ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చుకుని, మూడోసారి బలవంతంగా రైలు ఎక్కగలిగింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ రైల్వే పోలీసులు లేకపోవడాన్ని, ఆమెను వారించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “ప్రాణాలను పణంగా పెట్టి రైలు ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఈ రైలు కాకపోతే, మరోరైలు. ప్రాణాలు పోతే రావు కదా?” అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. “ఆవిడ రైలు ఎక్కేందుకు అంతలా ప్రయత్నిస్తుంది అంటే, అందులో తన పిల్లలు ఉండొచ్చు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆవిడ అన్నిసార్లు పడిపోతున్నా, కనీసం ఎవరూ సాయం చేయలేకపోయారు” అని మరో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తంగా నెటిజన్లు కొంత మంది ఆమెను తిడుతుంటే, మరికొంత మంది ఆమె అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచించాలంటున్నారు.

Advertisement

Read Also: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?

ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కచ్చింగా తెలియకపోయినా, ఢిల్లీ-ఆగ్రా రైల్లో జరిగిందని కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, 850 ఇండియన్ ఫ్లైట్స్ క్యాన్సిల్!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×