E-Paper
Advertisement

Teacher Suspended: ఇంగ్లిష్ టీచర్ ఇన్ స్టాలో రీల్స్.. సస్పెండ్ చేసిన అధికారులు.. క్షమించాలని వీడియో రిలీజ్

Teacher Suspended: ఇంగ్లిష్ టీచర్ ఇన్ స్టాలో రీల్స్.. సస్పెండ్ చేసిన అధికారులు.. క్షమించాలని వీడియో రిలీజ్
Advertisement

Teacher Suspended: స్కూల్ లో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ సోషల్ మీడియా మోజులో పడ్డారు. పాఠాలు పక్కన పెట్టి రీల్స్ చేస్తుండడంతో వివాదాస్పదం అయింది. ఖమ్మం జిల్లా మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బానోత్ గౌతమి గత కొన్ని రోజులుగా.. ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేయడం, అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ టైం వృధా చేస్తుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో.. తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రైవేట్ సంస్థలకు ప్రమోషన్

ఇంగ్లిష్ టీచర్ గౌతమి సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటారు. రీల్స్ తో సరిపెట్టకుండా.. ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి ప్రైవేట్ విద్యాసంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు ప్రమోషన్స్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. లాభాపేక్షతో ప్రైవేట్ సంస్థలకు ప్రమోషన్ చేయడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం. పాఠశాల పనివేళల్లో కూడా ఆమె పాఠాలపై దృష్టి పెట్టకుండా ఫోన్ లోనే ఎక్కువ సేపు గడుపుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుతో ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు…తీరు మార్చుకోవాలని హెచ్చరించినా వినకపోవడంతో చివరికి సస్పెండ్ చేశారు.

క్షమించండి.. ఇక రీల్స్ చేయను

Advertisement

తనను సస్పెండ్ చేయడంపై గౌతమి స్పందించారు. ఇక జన్మలో రీల్స్ చేయనని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉపాధ్యాయురాలిగా తన వృత్తికి ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు. అవివేకంతో, తెలియక కమర్షియల్స్ చేశానన్నారు. సైనిక సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని చెబితే తాను ప్రైవేట్ స్కూల్ కు వెళ్లానన్నారు. సోషల్ మీడియాలో తనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని ఆవేదన చెందారు. తానేమైనా హత్యలు, నిషేధిక పదార్థాలు విక్రయించానా అని ప్రశ్నించారు.

ఇన్ స్టా రీల్స్ గురించి తనను ఎవరూ హెచ్చరించలేదన్నారు. పిల్లల రీల్స్ తప్ప, తన విధి నిర్వహణకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరానన్నారు. స్కూలులో ఎప్పుడూ వీడియోలు చేయలేదన్నారు. తన ఫ్రీ టైంలో మాత్రమే రీల్స్ చేశానని చెప్పారు. అన్యాయంగా తనను విధుల్లోంచి తొలగించారని ఆవేదన చెందారు. తనను క్షమించాలని, ఇకపై రీల్స్ చేయనని చెప్పారు.

Advertisement

Also Read: రీల్స్ పిచ్చితో దారుణం.. డెలివరీ బాయ్‌పై కత్తులతో దాడి చేసి, ఆ తర్వాత

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×