E-Paper
Advertisement

Sunrisers Eastern Cape: వివాదంలో స‌న్ రైజ‌ర్స్‌..ట్రోఫీలో బీర్లు పోసుకుని తాగేశారు, షాకింగ్ వీడియో వైర‌ల్‌

Sunrisers Eastern Cape: వివాదంలో స‌న్ రైజ‌ర్స్‌..ట్రోఫీలో బీర్లు పోసుకుని తాగేశారు, షాకింగ్ వీడియో వైర‌ల్‌
Advertisement

Sunrisers Eastern Cape:  సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ లో ( South Africa T20 League 2026 Tournament ) ముచ్చటగా మూడోసారి కావ్య పాపకు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో అంటే 2023లో మొదటిసారి ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, 2024 లో కూడా టైటిల్ గెల్చుకుంది. 2025లో ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోయిన సన్రైజర్స్, ఈ సంవత్సరం మాత్రం టైటిల్ గెల్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరు మారుమోగుతోంది. అయితే సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లేయర్లు టైటిల్ గెలిచిన ఆనందంలో ఓ అసభ్యకరమైన పనిచేసి వివాదంలో చిక్కుకున్నారు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ సంద‌ర్భంగా గెలిచిన టైటిల్ లో బీరు పోసి తాగేశారు స‌న్ రైజ‌ర్స్‌ ప్లేయర్లు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫాన్స్ సీరియస్ అవుతున్నారు. ప‌విత్రమైన టైటిల్ లో మ‌ద్య‌పానం పోస్తారా ? అని మండిప‌డుతున్నారు.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

వివాదంలో స‌న్ రైజ‌ర్స్‌..ట్రోఫీలో బీర్లు పోసుకుని తాగేశారు

Advertisement

సౌత్ ఆఫ్రికా T20 లీగ్ 2026 టోర్నమెంట్ నిన్నటి వరకు చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఇందులో ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కేప్ టౌన్ లోని న్యూ ల్యాండ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రిటోరియా క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది.

ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన ప్రిటోరియా క్యాపిటల్స్ 158 పరుగులు సాధించగలిగింది ప్రిటోరియల్ క్యాపిటల్. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పడుతూ లేస్తూ ఆడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. కానీ చివరికి మ్యాచ్ మాత్రం గెలిచింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 19.2 ఓవర్లు ఆడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు నష్టపోయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ లక్ష్యాన్ని చేదించి మూడవసారి టైటిల్ గెల్చుకుంది. అయితే టైటిల్ గెల్చుకున్న తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లేయర్లు కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారు. ట్రోఫీలో బీరు పోసి తాగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన ట్రోఫీలో ఇలా తాగడం ఏంటని నిలదీస్తున్నారు.

ఆనందంలో కావ్య పాప

Advertisement

మన ఇండియాకు చెందిన కావ్య పాప ఈ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు కూడా ఓనర్ అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో కంటే ఈ దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అద్భుతంగా రానిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు టైటిల్స్ వచ్చాయి. దీంతో కావ్య పాప ఎగిరి గంతేస్తున్నారు.

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×