BigTV English

Congress: కోమటిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి వేటు తప్పదా?

Congress: కోమటిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి వేటు తప్పదా?
Komatireddy venkatreddy Cheruku Sudhakar

Congress: “నీ హాస్పిటల్‌ను పేల్చేస్తాం. మీ నాన్నను చంపేస్తాం. వంద మంది రెడీగా ఉన్నారు”.. పక్కా రౌడీలా, ఫ్యాక్షనిస్టులా బెదిరించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సొంత పార్టీ నేత కొడుక్కే ఫోన్ చేసి స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చారు. ఆ ఫోన్ ఆడియో కలకలం రేపడంతో.. మళ్లీ ఎప్పటిలానే నా ఉద్దేశం అదికాదని.. వాయిస్ ఎడిట్ చేశారని.. రొటీన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఎన్నాళ్లని.. ఎన్నని.. భరిస్తారు కాంగ్రెస్ నేతలు. అందుకే, ఈసారి కోమటిరెడ్డిపై గట్టిగానే గురి పెట్టారు. పోలీస్ కేసు, ఏఐసీసీకి ఫిర్యాదులతో వెంకట్‌రెడ్డిని బాగానే కార్నర్ చేస్తున్నారు.


గిల్లడం బాగా అలవాటు చేసుకున్నట్టున్నారు కోమటిరెడ్డి. కానీ, ప్రతీసారి గిల్లితే గిల్లించుకుంటూనే ఉండరుగా. ఏకంగా చంపేస్తారంటూ మర్డర్ వార్నింగ్ ఇవ్వడం మామూలు విషయమే. ఇలాగే వదిలేస్తే ఇంకెక్కడికి దారి తీస్తారో. పార్టీకి, పార్టీ నేతలకు ఇంకెంత డ్యామేజ్ చేస్తారో. అందుకే, వదిలేదేలే అంటూ చెరుకు సుధాకర్ సీరియస్‌గా డీల్ చేస్తున్నారు. ఆయనకు మిగతా సహచరులు ఫుల్‌గా సహకరిస్తున్నారు. కోమటిరెడ్డిపై వేటుకు ఉచ్చు బిగిస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై, తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు చెరుకు సుధాకర్‌. రాష్ట్ర కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. కోమటిరెడ్డిపై తాను ఏ రోజూ ఎలాంటి విమర్శలు చేయలేదని, అయినా తనను చంపేస్తానని బెదిరించడం దారుణమన్నారు. ‘కోమటిరెడ్డి మాటలు క్రిమినల్‌ ఆలోచనతో ఉన్నాయి. ఇది మేం సామాన్యంగా తీసుకోవడం లేదు’ అని అన్నారు.


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు, కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాంటూ ఏఐసీసీపై ఒత్తిడి పెంచేందుకు బడుగుబలహీన వర్గాల నాయకులు.. పార్టీ సీనియర్‌ నాయకులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెంచి.. కోమటిరెడ్డిపై వేటు పడేలా యాక్షన్‌లోకి దిగారు చెరుకు సుధాకర్ అండ్ కో.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×