E-Paper
Advertisement

Scientists:-కంటిచూపు లేని శాస్త్రవేత్తలకు అండగా టెక్నాలజీ..

Scientists:-కంటిచూపు లేని శాస్త్రవేత్తలకు అండగా టెక్నాలజీ..
Advertisement

Scientists:-శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త అద్భుతాలను ప్రపంచంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంటారు. అయితే అలాంటి శాస్త్రవేత్తల్లో కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారిలో కొందరు దివ్యాంగులు కూడా ఉంటారు. అయినా కూడా వారి మేధస్సు మాత్రం చురుగ్గానే పనిచేస్తుంటుంది. ఇప్పటికే ప్రపంచంలో పేరున్న శాస్త్రవేత్తలు కొందరు అంధులు కూడా ఉన్నారు. అలాంటి వారికి డేటా స్పష్టంగా అర్థమయ్యేలా ఒక టెక్నాలజీ ఏర్పాటయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 డేటా సైంటిస్టులు టైడీవర్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విషయంలో అతి చురుగ్గా పనిచేస్తున్నారని సర్వేలో తేలింది. అందులో ఒకరు జూయంగ్ సియో అనే ఒక బ్లైండ్ సైంటిస్ట్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి బ్లైండ్ సైంటిస్టులను ప్రోత్సహించాలని ఇతర సైంటిస్టులు నిర్ణయించుకున్నారు. అందుకే వారికోసమే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వారిని టైడీవర్స్‌కు దగ్గర చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

టైడీవర్స్‌లో డేటా మొత్తం చార్ట్స్, గ్రాఫ్స్ రూపంలో ఉంటుంది. అయితే ఈ డేటాను మొత్తం టచ్, సౌండ్, స్పీచ్ ద్వారానే తెలుసుకున్నాడు జూయంగ్. జూయంగ్ పదేళ్ల వయసులోనే గ్లైకోమా వ్యాధితో తన కంటిచూపును పోగొట్టుకున్నాడు. అయినా తన మేధస్సుతో శాస్త్రవేత్తగా మారాడు. అంతే కాకుండా ఇప్పుడు అతి కష్టమైన టైడీవర్స్‌ను నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకే తనలాంటి కంటిచూపు లేని ఇతర సైంటిస్టులకు కూడా టైడీవర్స్‌ను నేర్చుకునే విషయంలో సహాయంగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు.

డేటాను కంటితో చూసి అర్థం చేసుకోలేని వారికోసం ఇతర విధానాలను కనిపెట్టడంలో జూయంగ్ లీనమయ్యాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కంటిచూపు లేని శాస్త్రవేత్తలు ఉన్నారో స్పష్టంగా తెలియజేసే డేటా లేదు. కానీ దాదాపు 50 వేలల్లో 100 మంది కంటే తక్కువే కంటిచూపు సమస్యలు ఉన్న శాస్త్రవేత్తలు ఉన్నారని కొన్నేళ్ల క్రితం చేసిన స్టడీలో తేలింది. వారికోసం కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తుందని ఈ స్టడీలో పేర్కొంది.

Advertisement

కేవలం కంటిచూపు సమస్యలు ఉన్నవారు మాత్రమే కాదు.. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న ఎంతోమంది కూడా శాస్త్రవేత్తలుగా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారు తమ డేటాను వాయిస్ నోట్‌గా మార్చుకొని స్టడీ చేస్తుంటారు. అలా కాకుండా స్క్రీన్ రీడర్స్ సాయంతో వారికి డేటా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలకు ఏ సమస్య ఉన్న కొత్త కొత్త టెక్నాలజీల సాయంతో వారు ముందుకు వెళ్తూ.. ఎన్నో పరిశోధనలకు తోడుగా నిలబడుతున్నారు.

మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన రోబో..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×