BigTV English

Holi: టీమిండియా హోలీ.. బస్సులో రంగేలి.. వీడియో వైరల్

Holi: టీమిండియా హోలీ.. బస్సులో రంగేలి.. వీడియో వైరల్

Holi: హోలీ రే హోలీ రంగేలీ.. దేశమంతా రంగులమయంగా మారింది. హోలి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఊరూవాడా కేరింత. రంగులతో పులకింత. సామాన్యులేనా.. సెలబ్రెటీలు సైతం హోలీ పండుగ ధూంధాంగా చేసుకున్నారు. టీమిండియా క్రికెటర్లు సైతం రంగులు చల్లుకున్నారు.


క్రికెటర్ల షెడ్యూల్‌ ఫుల్ బిజీగా ఉంది. తీరిక లేకుండా సమయం గడుపుతున్నారు. అందుకే, బస్సులోనే హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా.. నాలుగో టెస్ట్ కోసం అహ్మదాబాద్‌కు చేరుకున్న క్రికెటర్లు.. బస్సులో హోలీ ఆడారు.

విరాట్ కోహ్లీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. మిగతా ఆటగాళ్లు వాళ్లతో కలిశారు. ‘హే రంగ్ బర్‌సే’ సాంగ్‌కు రంగులు చల్లుకుంటూ.. స్టెప్పులేస్తూ.. సరదా సరదాగా హోలీ జరుపుకున్నారు. అదే జోష్ కంటిన్యూ చేస్తూ.. డ్రెసింగ్ రూమ్‌లోనూ హోలీ సెలబ్రేషన్స్ కొనసాగించారు.


బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్‌ను “శుభ్‌మన్‌ గిల్” రికార్డు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఆ వీడియో వైరల్ అయింది. లైకులు, కామెంట్లతో ట్రెండింగ్‌గా మారింది. వారెవా అంటూ.. ఆ వీడియో చూసిన నెటిజన్లు సైతం మస్త్ ఖుషీ అవుతున్నారు.

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×