BigTV English

KTR Vs Bandi Sanjay : గ్రూప్-1 లొల్లి – నీ చీకటి బతుకు బయటపెడతా.. కేటీఆర్‌ కామెంట్స్‌పై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్

KTR Vs Bandi Sanjay : గ్రూప్-1 లొల్లి – నీ చీకటి బతుకు బయటపెడతా.. కేటీఆర్‌ కామెంట్స్‌పై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్

Bandi Vs KTR on Group-1 Exam : రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ప్రభుత్వపై ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై మండిపడ్డారు. ఈ మేరకు సంజయ్ కు చురకలు అంటించారు.


బండికి ఏం చదువుకున్నారు ? 

గ్రూప్ 1 అభ్యర్థుల తరపున ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు బండి సంజయ్ కి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన ఏం చదువుకున్నాడని, పరీక్షల గురించి ఆయనకేం తెలుస్తుందన్నారు.  ఆయనకు పేపర్లు లీక్ చేయడమే తెలుసని కేటీఆర్ అన్నారు.


మాస్ ర్యాగింగ్ చేసిన బండి…

దీంతో బండి సంజయ్ భగ్గుమన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. తాను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు నీదని ఆరోపించారు. అనవసరంగా తన జోలికి వస్తే నీ చీకటి బతుకును బయటపెడతానని కేటీఆర్‎పై చిందులుతొక్కారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పని ఎప్పుడో అయిపోయిందన్నారు బండి సంజయ్. 10 జేసీబీలు పెట్టి లేపిన ఆ పార్టీ లేవదన్నారు. కేటీఆర్ తీరు వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారన్నారు. నిరుద్యోగుల ఆందోళనపై తాము సామరస్యంగా నిరసన చేస్తున్నామని, అందులోకి బీఆర్ఎస్ అక్రమంగా చొరబడి రాజకీయం చేసిందన్నారు. నిరుద్యోగుల ముసుగులో అల్లర్లను సృష్టించేందుకు కుట్రలు చేశారన్నారు.

బండి, రేవంత్ కలిసి ఆడుతున్న డ్రామా…

గ్రూప్-1 అభ్యర్థులతో కనీసం చర్చలు చేయకపోవడం ప్రభుత్వ దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులను పశువుల్లా చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు భవిష్యత్ నిర్మాతలు గ్రూప్ 1 అభ్యర్థులు అని, అలాంటి వాళ్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

ప్రస్తుతం కేసు సుప్రీంలో ఉందని, అక్కడ తీర్పు వచ్చే వరకు అయినా వేచిచూస్తే బాగుండేదన్నారు. కేందజ్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది అన్నారు. తెలంగాణ సర్కారు, పోలీస్ బందోబస్తుతో బండి సంజయ్ కి ర్యాలీ చేయించేందుకు రేవంత్ సహకరించారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కేటీఆర్ వ్యంగస్త్రాలు…

బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు ఆయన ఏం చదువుకున్నాడని, ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుందన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడని వ్యంగస్త్రాలు సంధించారు. అభ్యర్థుల తరఫున ఆయన ఏం చర్చలు చేస్తారంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు.

Related News

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Big Stories

×