BigTV English

Botsa on TDP Govt: అంతన్నారు.. ఇంతన్నారు.. జమిలీ ఎన్నికలు వస్తున్నాయ్.. కూటమి ఖేల్ ఖతం.. మాజీ మంత్రి బొత్స

Botsa on TDP Govt: అంతన్నారు.. ఇంతన్నారు.. జమిలీ ఎన్నికలు వస్తున్నాయ్.. కూటమి ఖేల్ ఖతం.. మాజీ మంత్రి బొత్స

Botsa on TDP Govt: ప్రస్తుతం పొలిటికల్ టాపిక్ ఎక్కడ చర్చకు వచ్చినా.. జమిలీ ఎన్నికల గురించి నాలుగు మాటలు ఉండాల్సిందే. అందుకు కారణం ఇటీవల కేంద్రం జమిలీ ఎన్నికలకు మొగ్గు చూపుతుందన్న వార్తలే. అది కూడా 2027లో ఈ ఎన్నికలు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతుంది. జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే. ఈ ఎన్నికలు నిర్వహిస్తారో.. లేదో కానీ అప్పుడే పొలిటికల్ పార్టీలు.. ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నాయని తాజా రాజకీయ స్థితిగతులను చూసి చెప్పవచ్చు. తాజాగా ఏపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జమిలీ ఎన్నికలపై కామెంట్ చేసి.. కూటమి ఝలక్ ఇచ్చారు. ఇంతకు అసలు బొత్స సత్యనారాయణ ఏమి చెప్పారంటే…


మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలే చెబుతున్నారన్నారు. జమిలీ ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుందని, అందుకు తామెప్పుడూ సిద్దమేనన్నారు. అయితే కూటమి ఏవేవో అబద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు జమిలీ ఎన్నికలంటేనే కూటమి భయాందోళన చెందుతుందని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి, అసలు వాటి ఊసే మరచి పోయిందన్నారు.

ఇటీవల నూతన మద్యం విధానం అంటూ మద్యం ప్రియులను కూడా మోసం చేసిందన్నారు. అవే ధరలు, అవే బ్రాండ్స్ మార్కెట్ లోకి పంపించి, తాము ధరలు తగ్గించామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పటికే అమ్మ ఒడి పథకంలో భాగంగా.. విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమయ్యేదని తెలిపారు. కానీ కూటమి అమ్మ ఒడి పథకం ను తల్లికి వందనం పేరు మర్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు.


Also Read: Dead Bodies Missing: శవాలు మిస్సింగ్.. మాయా లేదు మర్మం లేదు.. ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరంటే?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మరచిపోయారు.. ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా రానున్నాయి. ఇక మీరెప్పుడూ హామీలు నెరవేరుస్తారంటూ కూటమి నేతలను ప్రశ్నించారు. మాటలు కాదని చేతల్లో ప్రజా సంక్షేమ చూపించాలని, సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావించామని, కానీ జమిలీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో సీఎం చంద్రబాబు ప్రకటించాలన్నారు. జమిలీ ఎన్నికలకు తాము కూడా సిద్దమేనన్న మాజీ మంత్రి బొత్స, తమ పార్టీ కార్యకర్తలు కూడా సిద్దంగా ఉండాలని కోరారు.

జమిలీ ఎన్నికల సంగతి అటుంచితే, పార్టీలు మాత్రం ఇప్పటి నుండే సిద్దం కానున్నాయి. ఇప్పటికే పార్టీల కార్యకర్తలకు ఎన్నికల సమరం రానుంది.. మీరందరూ సిద్దం కండి అంటూ పార్టీలు పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×