BigTV English

Nani: ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి, నాని ఒప్పుకుంటాడా.?

Nani: ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి, నాని ఒప్పుకుంటాడా.?

Nani: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన నాని అష్టా చమ్మా సినిమాతో నటుడుగా అడుగులు వేస్తూ, హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. అందరు హీరోల్లా కాకుండా కొన్ని ప్రత్యేకమైన కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకొని, తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు నాని. నాని క్వాంటిటీతోపాటు క్వాలిటీ సినిమాలు కూడా చేస్తాడు అని ఒక పేరుని సాధించాడు. నేడు నాని సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ సినిమా బాగుంటుంది అని నమ్మిన ఆడియన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో నాని చేసిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నాయి.


జెర్సీ సినిమాకి ముందు తర్వాత

నాని సినిమాలో ప్రస్తావన విషయానికొస్తే జెర్సీ సినిమా తర్వాత జెర్సీ సినిమాకి ముందు అని చెప్పొచ్చు. జెర్సీ సినిమాలో అర్జున్ అనే పాత్రలో కనిపించాడు నాని. ఈ సినిమా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. నాని తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా జెర్సీ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా నానికి మంచి పేరును తీసుకొచ్చింది. ఇక నాని కెరియర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని సినిమాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. నాని కెరియర్ లో భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ వంటి సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.


నాని కాకుండా వేరే హీరోతో చేస్తారా

ఇక పిల్ల జమిందార్ సినిమా విషయానికొస్తే నాని కెరియర్ లో మంచి హిట్ అయిన సినిమా ఇది. కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా చాలామంది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నాని ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాని చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. వాస్తవానికి పిల్ల జమిందారు సినిమా మంచి సినిమా. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇప్పటికీ మంచి ఫీల్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు నాని ఉన్న స్థాయిలో మళ్లీ పిల్ల జమిందార్ లాంటి సినిమాకి సీక్వెల్ చేస్తాడా అనేది సందేహం. ఇక మేకర్స్ నానిని విడిచిపెట్టి వేరే వాళ్లతో తీస్తారా కూడా చాలామంది ఆలోచనలో పడ్డారు.ఇక ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శైలేష్ దర్శకత్వంలో చేస్తున్న హిట్ తర్వాత శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా దసరా సినిమాకు మించి ఉండబోతుందని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×