BigTV English

KTR said all the best to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్..కారణం ఇదే!

KTR said all the best to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్..కారణం ఇదే!

KTR said all the best to CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన 10 రోజులపాటు పర్యటించనున్నారు. మొదట 8 రోజులు అమెరికా పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. చివరి రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. తాజాగా, ఈ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


‘పెట్టుబడుల ఆకర్షణలో రేవంత్ విజయం సాధించాలి. తమ పదేళ్ల పాలనలో దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తెచ్చాం. రేవంత్ బృందం కూడా మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలి. కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ పాస్ వంటి వినూత్న విధానాలు తీసుకొచ్చాం. అంతకుముందు పదేళ్లలో రూ.4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్లు, వివిధ రంగాల్లో 24 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం. పార్టీలకతీతంగా తెలంగాణ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తాం.’ అంటే కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read: నాలుగు చక్రాల బైక్ నడిపిన నల్గొండ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి


ఇదిలా ఉండగా, అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ నెల 14 వరకు పర్యటించనున్న ఆయనకు తెలుగు ప్రజలు బొకేలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉంటుందుని తెలంగాణ సీఎం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పర్యటనలో భాగంగా అమెరికా, దక్షిణ కొరియాలోని టాప్ కంపెనీలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×