E-Paper
Advertisement

IND vs SL 2nd ODI: టీమ్ ఇండియాతో నేటి మ్యాచ్ కి ముందు.. శ్రీలంకకి షాక్

IND vs SL 2nd ODI: టీమ్ ఇండియాతో నేటి మ్యాచ్ కి ముందు.. శ్రీలంకకి షాక్
Advertisement

Sri Lanka’s Wanindu Hasaranga out of India series with Hamstring Injury: టీమ్ ఇండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే నేడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్ కి ముందు శ్రీలంక టీమ్ కి భారీ షాక్ తగిలింది. సీనియర్ ఆల్ రౌండర్, మిస్టరీ బౌలర్, మాజీ కెప్టెన్ హసరంగ గాయంతో వన్డే సిరీస్ కి దూరమయ్యాడు.

తొలి వన్డేలో మోకాలికి గాయమైంది. అయితే ఆ బాధతోనే తను బౌలింగు చేశాడు. శ్రీలంకను ఓటమి నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వైద్యులు స్కానింగ్ తీసి గాయం పెద్దగా ఉందని, రెస్ట్ అవసరమని అనడంతో శ్రీలంక జట్టు విచారంలో మునిగిపోయింది.

Advertisement

ఆల్రడీ పతిరన, మధుశంక కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు హసరంగా కూడా లేకపోవడంతో అంతంత మాత్రంగా ఉన్న జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హసరంగ ప్లేస్ లో జెఫ్రీ వాండర్సే ను శ్రీలంక మేనేజ్మెంటు తీసుకుంది.

మరో వైపు టీమ్ ఇండియాలో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చునని అంటున్నారు.  అయితే పిచ్ మందకొడిగా ఉండటం వల్ల అదనంగా మరో స్పిన్నర్ ని తీసుకోవాలంటే మాత్రం ఆల్ రౌండర్ గా ఉన్న రియాన్ పరాగ్ కి అవకాశం రావచ్చునని అంటున్నారు.

Advertisement

Also Read: ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పతకధారి మను బాకర్

శివమ్ దుబె మొదటి వన్డేలో చక్కగా ఆడి, మ్యాచ్ ని గెలుపు ముంగిట వరకు తీసుకొచ్చాడు. ఒక్క పరుగు వద్ద అయిపోయాడు. అంతేకాదు బౌలింగులో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ తను మీడియం పేస్ వేస్తాడు. అందువల్ల స్పిన్నర్ కావాలంటే మాత్రం తనని పక్కన పెట్టి రియాన్ కి అవకాశం ఇచ్చేలా ఉన్నారు

అంతకుమించి పెద్ద మార్పులు ఉండకపోవచ్చునని అంటున్నారు. మొదటి వన్డేలో ఆడిన జట్టే.. రెండో వన్డేలో ఆడుతుందని అంటున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×