E-Paper
Advertisement

Lalita Jewelery: నోటీసులు ఊరికే రావు కదా..లలితా జ్యువెలరీ అధినేతకి నోటీసులు

Lalita Jewelery: నోటీసులు ఊరికే రావు కదా..లలితా జ్యువెలరీ అధినేతకి నోటీసులు
Advertisement

Lalita Jewelery fake GST Returns 15 crore rupees scam: టీవీ పెట్టగానే గుండుతో ఉన్న ఓ వ్యక్తి వచ్చి తమ నగలను కొనిచూడండి తేడా మీరే గమనించండి..పక్క షాపులో నగలతో కంపేర్ చేసుకోండి..డబ్బులు ఊరికే రావు అంటూ క్లాసులు పీకే యాడ్ గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరు. అంతగా పాపులర్ అయింది ఆయన సంస్థ లలితా జ్యువెలరీ. తన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్. ప్రత్యేకంగా సెలబ్రిటీలు, సినిమా తారలను తమ కమర్షియల్ యాడ్స్ కోసం సంప్రదించలేదు. తన సంస్థకు తానే బ్రాండ్ గా మారాడు. చూడటానికి కామెడీగా ఉన్నా జనం కూడా బాగా ఈయన యాడ్స్ కు అలవాటు పడ్డారు. యాడ్ చివర్లో డబ్బులు ఊరికే ఎవరికీ రావు అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ప్రతి ఒక్కరి నోళ్లలో నానింది.

చిక్కుల్లో కిరణ్ కుమార్

Advertisement

అదంతా పక్కన పెడితే కిరణ్ కుమార్ అని పిలవబడే లలితా జ్యువెలరీ అధినేత పాపం చిక్కుల్లో పడ్డారు. అందరినీ పక్క షాపులో కంపేర్ చేసుకోండని చెప్పే ఈయన తన సొంత విషయంలో మాత్రం తప్పులో కాలేశారు. కేంద్రానికి సమర్పించే జీఎస్టీ లెక్కలలో చాలా తేడాలు కనిపించాయి. ఆయన సమర్పించిన జీఎస్టీలో అన్నీ తప్పుడు తడకలు ఉన్నట్లు అధికారులు తేల్చిపారేశారు. పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న లలితా జ్యువెలరీ షాప్ కు సంబంధించిన ఆడిట్ లో తనకు రావసిన జీఎస్టీ ద్వారా యాభై ఆరు కోట్ల మేరకు క్లయిమ్ చేసుకున్నారు. వాస్తవానికి లెక్కల ప్రకారం చూసుకుంటే నలభై ఒక్క కోట్లే రావలసి ఉంది. ఆయనకు రావలసిన సొమ్ముకన్నా అధికంగా పదిహేను కోట్లు ఎక్కువ క్లయిమ్ చేసుకోవడంతో సీటీఓ అధికారులు జీఎస్టీ ద్వారా అయనకు నోటీసులు పంపించారు. దీనితో పబ్లిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో లలితా అధినేతపై ట్రోలింగులు మొదలు పెట్టేశారు.

ట్రోలింగులు మొదలెట్టేశారు

Advertisement

మీ విషయంలో మాత్రం డబ్బులు ఊరికే వస్తాయని అనుకుంటున్నాం అంటున్నారు. మరికొందరు పక్కనే ఉన్న దుకాణాలలో కంపేర్ చేసుకోవడం కాదు..తమరు కూడా సిన్సియర్ గా జీఎస్టీ కడుతున్న వ్యాపారులతో కంపేర్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు ముసలాయనే కానీ మహానుభావుడు అంటూ విపరీతంగా ట్రోలింగులు మొదలు పెట్టారు. తప్పుడు లెక్కలు చూపించి 15 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి టెండర్ పెట్టిన లలితా జ్యువెలరీ యజమానికి ఇప్పుడీ వ్యవహారమంతా తలనొప్పిగా మారింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×