E-Paper
Advertisement

KTR vs Bandi: ట్విట్టర్‌లో రాశిఫలాల రచ్చ.. పొలిటికల్ పంచాంగం..

KTR vs Bandi: ట్విట్టర్‌లో రాశిఫలాల రచ్చ.. పొలిటికల్ పంచాంగం..
Advertisement
KTR Bandi sanjay

KTR vs Bandi: కాదేదీ రాజకీయ విమర్శలకు అతీతం. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇక్కడ ఫాంహౌజ్ కేసులో బీఎల్ సంతోష్‌ను సిట్ టార్గెట్‌ చేస్తే.. అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను కార్నర్ చేసింది ఈడీ. లేటెస్ట్‌గా TSPSC పేపర్ లీకేజీలో దీక్షలు, ధర్నాలు, ముట్టడిలతో హీట్ పెంచేశారు కమలనాథులు.

ఇక, రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో మోదీకి, బీజేపీకి పంచ్‌లు వేసే కేటీఆర్.. ఉగాది రోజున మరోసారి తన సెటైరికల్ ట్వీట్లకు పని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రాశిఫలాలు ఇవే అంటూ.. పొలిటికల్ పంచాంగం చెప్పారు. కేటీఆర్ ట్వీట్ ఇలా ఉంది…

Advertisement

ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!

అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!

Advertisement

బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!

–మరి, కేటీఆర్ బీజేపీని ఇలా గిల్లితే కమలనాథులు ఊరుకుంటారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగారు. కేటీఆర్‌కు కౌంటర్ ట్వీట్ సంధించారు. బండి ట్వీట్ ఇలా సాగింది….

ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి

అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!

తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి… పతనం ఇగ షురువాయే.

–ఇలా ఉగాది రోజు కూడా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఇలా ట్విట్టర్‌లో పొలిటికల్ వార్‌కు దిగడం ఆసక్తిగా మారింది. పండుగ పూటా ఇదేం గోల అనేవారూ ఉన్నారు. అసలే ఎన్నికల యేడాది. ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోవడం లేదు లీడర్లు. ఉగాదినీ, రాశిఫలాలనూ రాజకీయ విమర్శలకు వాడేసుకున్నారు కేటీఆర్ అండ్ బండి సంజయ్.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×