BigTV English

Telescope :- కొత్తరకం టెలిస్కోప్.. ఏషియాలోనే మొదటిసారి…

Telescope :- కొత్తరకం టెలిస్కోప్.. ఏషియాలోనే మొదటిసారి…

Telescope :- ఇండియా ఇప్పటికే ఇతర దేశాల సాయంపై ఆధారపడకుండా ఉన్న వనరులతోనే సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలని చూస్తోంది. శాస్త్రవేత్తలు కూడా తమకు అందిన వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అందరినీ గర్వపడేలా చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేయలేని ప్రయోగాలు ఇండియాలో జరుగుతున్నాయి. తాజాగా ఇండియా చేసిన ఓ ప్రయోగం ఏసియాలోనే మొదటిగా నిలిచింది.


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ ఏసియాలోని మొదటిసారిగా 4 మీటర్ల పొడవైన ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ (ఏఎల్ఎమ్టీ)ని ఇండియాలో లాంచ్ చేశారు. తాజాగా దీని లాంచ్ ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్‌లో జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరాఖండ్ గవర్నర్ జెన్ గుర్మీత్, యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్పేస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఇది ఒక ల్యాండ్‌మార్క్ అని వారు పేర్కొన్నారు.

అంతరిక్షం గురించి, ఆస్ట్రానమీ గురించి పరిశోధనలు చేసి, మిగతా ప్రపంచానికి ఆ పరిశోధనల గురించి షేర్ చేయడానికి ఈ లిక్విడ్ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. దేవస్థల్ అబ్జర్వేటరీ క్యాంపస్ ఆఫ్ ఆర్యభట్టా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏరియస్)లో 2,450 మీటర్ల విస్తీర్ణంలో ఈ టెలిస్కోప్ ఏర్పాటు జరిగింది. 2022 మేలో మొదటిసారిగా ఈ లిక్విడ్ టెలిస్కోప్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇది పూర్తిస్థాయిలో ఆకాశంపై పరిశోధనలు చేయడానికి సిద్ధమయ్యింది.


పైనుండి చూస్తే ఈ లిక్విడ్ టెలిస్కోప్ అనేది లిక్విడ్ మెర్యూరీ మిర్రర్ రూపంలో కనిపిస్తుంది. దీనిపై ఒక సన్నటి మైలార్ ఫిల్మ్ కూడా ఏర్పాటు చేయబడింది. ఆస్ట్రానమీ గురించి గమనించడానికి ఇలాంటి టెలిస్కోప్ ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని జితేంద్ర సింగ్ గర్వంగా తెలిపారు. ప్రతీ రాత్రి ఈ టెలిస్కోప్.. ఆకాశాన్ని స్టడీ చేసి 10 నుండి 15 జిగాబైట్స్ డేటాను అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమాచారం అంతా ఏఐ రూపంలో ఉంటుందని వారు అన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×