E-Paper
Advertisement

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

అమెరికా ప్రమాదానికి గురైన  మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?
Advertisement

America: తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు‌యాష్కీ గౌడ్ భార్య డాక్టర్ సుచీ యాష్కీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదానికి గురయ్యింది. అమెరికాలో సుచీ యాష్కీ వైద్యురాలిగా పని చేస్తున్నారు. బుధవారం కూతురు గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య కారు

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు‌యాష్కీ గౌడ్ భార్య డాక్టర్ సుచీ యాష్కీ ప్రయాణిస్తున్న కారు అమెరికాలో ప్రమాదానికి గురైంది.  బోస్టర్ నుంచి న్యూయార్క్ వస్తుండగా దారి మధ్యలో దట్టమైన వర్షం పడింది. దీని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుచీ రిబ్స్ విరిగినట్లు సమాచారం.

వెంటనే అంబులెన్సులో న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మధుయాష్కీ బంధువులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుచీ యాష్కీ  

మధుయాష్కీ చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇటీవల అమెరికా వెళ్లారు మధుయాష్కి. కుమార్తెను బోస్టన్ మెడికల్ కాలేజీలో ఎండీ కోర్సులో చేర్పించినట్టు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన తర్వాత లగేజీ ఎక్కువగా ఉండడంతో భార్య సూచి యాష్కీ, మధుయాష్కి వేర్వేరు కార్లలో బయలు దేరినట్టు సమాచారం.

మార్గమధ్యంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పిన కారు బోల్తా పడింది. మధుయాష్కీ భార్య సుచీ ఎండోక్రైనాలజిస్ట్ గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు కోమలి కాగా, చిన్నకూతురు పేరు గగన. ఈ కార్యక్రమం పూర్తి తర్వాత దంపతులు ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

ALSO READ: పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×