E-Paper
Advertisement

Ice Cream : ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపి.. ఛీ ఛీ ఎంత దారుణం..

Ice Cream : ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపి.. ఛీ ఛీ ఎంత దారుణం..
Advertisement

Sperm in Ice Cream : ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. పైగా వేసవికాలం వచ్చింది కదా.. ఇంకాస్త ఎక్కువగానే ఐస్ క్రీమ్ ల వైపు మొగ్గుచూపుతారు. కాలంతో సంబంధం లేకుండా తినేవారైతే లెక్కే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడపడితే అక్కడ.. ఐస్ క్రీమ్ కనిపించిందే పాపంలా తినేస్తారు. అలాంటి వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్.. కాదు కాదు.. ఒళ్లు గగుర్పొడిచే న్యూస్. ఏంటో తెలిస్తే.. ఐస్ క్రీమ్ తినడాన్నే అసహ్యించుకుంటారు. కడుపులో తిప్పి వాంతి వచ్చినంత పనవుతుంది.

Advertisement

మార్కెట్లలో రకరకాల కంపెనీల పేర్లతో వచ్చే ఐస్ క్రీమ్ లలో కల్తీ జరుగుతుంటుంది. కల్తీ పాలు, రసాయనాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్ లు ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిందే. కానీ.. వరంగల్ లో వెలుగుచూసిన ఈ ఘటన అంతకుమించి ఉంది. ఓ నీచుడు ఐస్ క్రీమ్ లో ఏకంగా వీర్యం కలిపి అమ్మేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు నీచుడిని అరెస్ట్ చేశారు.

Also Read : సెలెబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ ఫైర్ కేసులో.. మరో ట్విస్ట్

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాంతంలో బాలాజీ కంపెనీ పేరుతో తయారు చేసి ఐస్ క్రీమ్ లను కొందరు ఊరూరా తిరిగి అమ్ముకుంటూ ఉంటారు. అయితే.. వాళ్లు అమ్మే ఫలుదా, ఐస్ క్రీమ్ లలో మూత్రం, వీర్యం కలుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐస్ క్రీమ్ తయారీకేంద్రంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ దారులను అదుపులోకి తీసుకున్నారు. గలీజ్ పనులకు పాల్పడి, ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపిన వ్యక్తినీ అరెస్ట్ చేశారు. ఐస్ క్రీమ్ లో స్పెర్మ్, యూరిన్ కలుపుతున్నారని తెలియడంతో వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.

వరంగల్ లో రోడ్డుపక్కన వ్యాపారం చేసే వారికి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి పదార్థానికీ పరిశుభ్రతను పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×