Big Stories

World Happiness Day : ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ దేశాలివే.. టాప్ ప్లేస్‌లో ఫిన్‌లాండ్, భారత్ ఎక్కడుందంటే..

- Advertisement -

Most Happiest Countries in World : సంతోషం.. మనిషి జీవితాన్ని నడిపించే చోదక శక్తి. మనల్ని సంతోష పెట్టి, మన జీవితానికి మార్గనిర్దేశం చేయగలిగేలా ఉండే ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. లక్ష కోరికలు, వెయ్యి భావోద్వేగాలు ఉండటం మనిషి సహజ లక్షణం. ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, భావోద్వేగాలు ఉంటాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ చూపించాలో.. తెలుసుకుని మసులుకుంటే జీవితమంతా సంతోషంగా ఉంటాం. రేపటి మీద ఉండే ఆలోచనలను తగ్గించుకుని ఈ క్షణం ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఉరుకుల పరుగుల జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలు, క్షణం తీరిక ఉండని ఉద్యోగాలు, ప్రశాంతంగా ఉండనివ్వని ఆలోచనలు.. సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. ఎంతలా అంటే.. సంతోషంగా ఉండటానికి కూడా ఒకరోజును పెట్టుకునే స్థాయికి వచ్చాం. మదర్స్ డే, ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే మాదిరిగా.. ఇంటర్నేషనల్ హ్యాపీయెస్ట్ డే ఒకటుంది.

- Advertisement -

ప్రతీ ఏడాది మార్చి 20వ తేదీన ఇంటర్నేషనల్ హ్యాపీయెస్ట్ డే ను జరుపుకుంటారు. 2012, జూలై 12న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోషదినంగా ప్రకటించాలని తీర్మానం చేసింది. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఐక్యరాజ్య సమితి అధికారిక వెబ్ సైట్ లో ఇలా రాసింది.

Also Read : ఐటీ ఉద్యోగులకు నీటి కష్టాలు.. రోజుకు రూ.500 ఖర్చుచేయాల్సిందే..

మార్చి 20 సంతోషంగా ఉండాల్సిన రోజు. సంతోషమనేది ప్రాథమిక మానవ లక్ష్యం. ఆర్థిక వృద్ధి, సమానమైన, సమతుల్య విధానం కోసం ఇలా పిలుపునిచ్చింది. ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ప్రజల లక్ష్యాలు, ఆకాంక్షలను రూపొందించడంలో, మెరుగైన జీవితాన్ని గడపడంలో ఈ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఉపయోగపడుతుందని తెలిపింది. స్థిరమైన అభివృద్ధి, శ్రేయస్సుతో పాటు పేదరిక నిర్మూలనను కూడా ప్రోత్సహిస్తుందని చెప్పింది.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జాబితాను తాజాగా విడుదల చేసింది ఐక్యరాజ్యసమితి. ఈ జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్ లాండ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. టాప్ 10 లిస్ట్ లో డెన్మార్క్, ఐస్ లాండ్ ఉండగా.. తాలిబన్ల కబంధహస్తాల్లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ఆఖరిస్థానం(143)లో ఉంది. టాప్ 20 దేశాల్లో.. 12వ స్థానంలో కోస్టారికా, 13వ స్థానంలో కువైట్ నిలిచాయి. ఈ జాబితాలో మొదటిసారిగా అమెరికా, జర్మనీ టాప్ -10 స్థానాలను కోల్పోయాయి. అమెరికా 23, జర్మనీ 24 స్థానాలకు పరిమితమయ్యాయి.

భారత్ విషయానికొస్తే.. గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో ఉంది. టాప్ 10 దేశాల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే 15 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండగా.. టాప్ 20లో కెనడా, యూకే దేశాలు మాత్రమే 30 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయని, ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశాలు సంతోషంగా ఉండటంలో వెనుకబడ్డాయని ఐ.రా.స రిపోర్ట్ పేర్కొంది.

 

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News