Big Twist In Celebrity Resort Air Gun Case: సెలెబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ ఫైర్ కేసు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఉత్కంఠ రేకెత్తిస్తుంది… క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.. రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది.. సిద్ధార్థ దాస్ తన భార్య స్మితను చంపడానికి ప్లాన్ వేశాడని ఆమె ప్రకటించింది. సిద్ధార్థ తన సోదరుడితో మాట్లాడిన వాట్సాప్ చాట్ రిలీజ్ చేసింది స్మిత భర్తతో ప్రాణభయం ఉందని స్మిత డీజీపీని కలిసింది.
సెలబ్రిటీ క్లబ్ లో తనను చంపడానికి సిద్ధార్థ్ కత్తి తీశాడని.. అతడి బారి నుంచి తప్పించుకోవడానికే మనోజ్ ఎయిర్ గన్ తీశాడని చెప్పింది. సిద్ధార్థ్ తమపై మర్డర్ అటెంప్ట్ చేయడానికి ప్లాన్ చేశాడని పేర్కొంది. గత కొన్నేళ్లుగా తనను చిత్రవధ అనుభవిస్తున్నానని వెల్లడించింది.
Also Read: తెలంగాణ కొత్త గవర్నర్ బుధవారం ప్రమాణ స్వీకారం..
తన కూతురును కూడా పలుమార్లు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. అటు డివోర్స్ కేసు మీద అడ్వొకేట్ హబీబ్ సుల్తాన్ అలీని కలిస్తే తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇప్పటికే హబీబ్ సుల్తాన్ పై పోక్సో కూడా నమోదైందని చెప్పింది. సిద్ధార్థ్ హత్యాయత్నానికి ప్రయత్నిస్తే తమపైనే కేసులు బుక్ చేశారని ఆరోపించింది.

Share