E-Paper
Advertisement

Hyderabad News: ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు, తానింకా ఆ పార్టీలో ఉన్నా

Hyderabad News: ఎమ్మెల్యే దానం నాగేందర్  కీలక వ్యాఖ్యలు, తానింకా ఆ పార్టీలో ఉన్నా
Advertisement

Hyderabad News: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం వేడెక్కింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. రేపో మాపో స్పీకర్ ముందుకు రానున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ దానం ఏమన్నారో తెలుసా? తానింకా ఆ పార్టీలో ఉన్నట్లు చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు

Advertisement

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ప్రసాదకుమార్ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు గడువు కోరారు. వారిలో ఒకరు కడియం శ్రీహరి కాగా, మరొకరు దానం నాగేందర్.

Advertisement

ఈ ఎమ్మెల్యేలిద్దరూ తమకు కొంత సమయం కావాలని స్పీకర్‌ని కోరారు. అందుకు ఆయన ఓకే చెప్పారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నానని కుండబద్దలు కొట్టేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని వెల్లడి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించబోతున్నామని మనసులోని మాట బయటపెట్టారు. ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పకనే చెప్పారు. 300 డివిజన్లలో తాను తిరిగి కాంగ్రెస్‌ పథకాలను ప్రజలకు వివరిస్తానన్నారు. చివరలో తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలపై స్పీకర్‌ విచారణ చేపట్టిన సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకు స్పీకర్‌కు ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దానం రాజీనామాకు సిద్దమయ్యారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ALSO READ: చేవెళ్ల బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. ఓనర్ ప్రధాన నిందితుడు

ఇకపోతే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలి యాదయ్య, సంజయ్‌కు సంబంధించిన నిర్ణయం స్పీకర్ వెల్లడించాల్సివుంది. అందులో ముగ్గుర్ని స్పీకర్ విచారించారు. ఇక కడియం తన నిర్ణయాన్ని ఓపెన్‌గా చెప్పారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించి వివరాలు కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ బహిరంగ వ్యాఖ్యలు రాజీనామాకు సిద్ధమయ్యారనే సంకేతాలు మొదలయ్యాయి. జనవరి ఫస్ట్ వీక్‌లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని సమాచారం. 

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×