E-Paper
Advertisement

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. టిప్పర్ ఓనరే ప్రధాన నిందితుడు

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. టిప్పర్ ఓనరే ప్రధాన నిందితుడు
Advertisement

Chevella Bus Accident: చేవెళ్ల (Chevella) పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. 18 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనలో టిప్పర్ యజమానిదే ప్రధాన బాధ్యత అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్ (Lachu Naik) పేరును తాజాగా ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో చేర్చి, ఆయన్నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. టిప్పర్ పరిమితికి మించి లోడ్ (Overload) ఉండటమే ప్రమాదానికి అసలు కారణమని తేలింది. ఈ ఓవర్ లోడ్ కారణంగానే డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడని, ఫలితంగా బ్రేకులు కూడా పనిచేయలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రమాద సమయంలో టిప్పర్ క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు యజమాని లచ్చు నాయక్ కూడా ప్రయాణిస్తున్నాడు. యజమాని పక్కనే ఉండి కూడా ఓవర్ లోడ్‌ను ప్రోత్సహించడం, డ్రైవింగ్‌ను పర్యవేక్షించకపోవడం నేరమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, యజమాని లచ్చు నాయక్ మాత్రం గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

గత నెల (నవంబర్) 3వ తేదీన చేవెళ్ల ప్రాంతంలో గ్రానైట్ లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు కాగా, ఏకంగా 18 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు చివరకు యజమాని నిర్లక్ష్యమే కారణమని తేల్చారు.

Advertisement

Read Also: Indian Woman Murdered: భారత యువతి హత్య.. సహచరుడే నిందితుడు? కెనడాలో దారుణం

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×