E-Paper
Advertisement

Ambassador Car: 60 ఏళ్ల కిందట అంబాసిడర్ కారు ధర ఇంతేనా? ఆ రేటుతో ఇప్పుడు టైరు కూడా రాదు!

Ambassador Car:  60 ఏళ్ల కిందట అంబాసిడర్ కారు ధర ఇంతేనా? ఆ రేటుతో ఇప్పుడు టైరు కూడా రాదు!
Advertisement

అంబాసిడర్ కారు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందూస్తాన్ అంబాసిడర్ లేదంటే అంబీ అని ముద్దుగా పిలిచేవారు. ఇది దేశంలో అత్యంత ప్రసిద్ధ కార్లలో ఒకటి. దశాబ్దాల పాటు ఇండియన్ రోడ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకుంది.   చాలా ఏళ్ల పాటు కుటుంబ అవసరాలకు, టాక్సీగా, ప్రభుత్వ వాహనంగా సేవలు అందించింది.

అంబాసిడర్ కారు ప్రారంభ ధర ఎంత అంటే?

అంబాసిడర్‌ను 1958లో కోల్‌ కతాలో ఉన్న హిందూస్తాన్ మోటార్స్ అనే సంస్థ ప్రారంభించింది. మోరిస్ ఆక్స్‌ ఫర్డ్ సిరీస్ III అనే బ్రిటిష్ కారు డిజైన్ ఆధారంగా ఈ కారును తయారు చేసింది. భారత్ లో ఈ కారును తయారీ రైట్స్ ను హిందూస్తాన్ మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ కారు ప్రారంభ సమయంలో ధర రూ. 14,000గా నిర్ణయించింది. అప్పట్లో ఈ ధర చాలా ఎక్కువ. కానీ, ఆ సమయంలో దేశంలో ఎక్కువ ఆప్షన్ లేని కారణంగా ఈ కారు బాగా పాపులర్ అయ్యింది.

ప్రజలు అంబాసిడర్ ను ఎందుకు ఇష్టపడ్డారంటే?  

Advertisement

అంబాసిడర్ పెద్దగా క్రోమ్‌తో ఉంటుంది. లోపల చాలా విశాలంగా ఉంటుంది. పెద్ద కుటుంబాలకు, సుదూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండేది. ఈ కారు చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. గతుకుల రోడ్ల మీద కూడా చక్కగా వెళ్లేది. ఇది తొలుత పెట్రోల్ ఇంజిన్‌తో ప్రారంభమైంది.  ఆ తర్వాత డీజిల్ ఇంజిన్‌లు కూడా వచ్చింది. దశాబ్దాల పాటు మంచి సీట్లు, కొత్త డాష్‌ బోర్డ్‌ లు, పవర్ ఫుల్ ఇంజిన్‌ లాంటి మార్పులు చేయబడ్డాయి. కానీ, దాని లుక్ మాత్రం అలాగే ఉండేది. కోల్‌ కతా లాంటి  నగరాల్లో చాలా మంది దీనిని టాక్సీగా గుర్తుంచుకుంటారు. ప్రభుత్వ అధికారులు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు.

50 ఏళ్లకు పైగా ప్రస్థానం

అంబాసిడర్ 1958 నుండి 2014 వరకు 50 సంవత్సరాలకు పైగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. 1980లలో ఎక్కువ యూనిట్లు సేల్ అయ్యాయి. అప్పట్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ 1990వ దశకంతో పాటు 2000లలో మారుతి సుజుకి లాంటి కంపెనీల నుండి కొత్త కార్లు వచ్చాయి. ఇవి చౌకగా, లేటెస్ట్ కార్లు కావడంతో నెమ్మదిగా ప్రజలు అంబాసిడర్‌ను కొనడం మానేశారు. 2014లో,  ఈ కారు అమ్మకాలు తగ్గడం, కంపెనీకి ఆర్థిక ఇబ్బందులు కలగడంతో హిందుస్తాన్ మోటార్స్ దీనిని తయారు చేయడం ఆపివేసింది. చివరి కారు మే 2014లో విడుదలైంది.

అంబాసిడర్ కార్లు మళ్లీ వస్తాయా?

Advertisement

అంబాసిడర్‌ను తిరిగి తీసుకురావడం గురించి చాలా చర్చలు జరిగాయి. 2017లో, హిందూస్తాన్ మోటార్స్ బ్రాండ్ పేరును ప్యుగోట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి రూ.80 కోట్లకు విక్రయించింది. అప్పటి నుంచి, ప్రతి సంవత్సరం కొత్త వెర్షన్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.  అంబాసిడర్ భారతీయ హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొత్తది వచ్చినా, పాత క్లాసిక్ ఒక లెజెండ్‌గా మిగిలిపోతుంది!

Read Also: 90s దుమ్మురేపిన కార్లు, ఆ రోజుల్లో వీటికి ఉండే క్రేజే వేరు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×