BigTV English

BRS MPs Joining BJP: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ఇద్దరు ఎంపీలు..

BRS MPs Joining BJP: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ఇద్దరు  ఎంపీలు..

BRS MPs Joining BJPBRS MPs Joining BJP(Political news in telangana): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా ఇద్దరు ఎంపీలు బీజెపీలో చేరడానికి రెడీ అయ్యారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.


నాగర్ కర్నూల్ ఎంపీ గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. గురువారం బీజేపలో చేరనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ బీ ఫామ్ పై పోటీ చేసిన పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవిపై 1,89,748 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Read More: పాపాల పుట్ట..! తవ్వేకొద్దీ బయటపడుతున్న బీఆర్ఎస్ బాగోతాలు..


అటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా పార్టీ అధిష్టానంపై గర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. జహీరాబాద్ ఎంపీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ రావుపై 6,229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Related News

Musi Floods: మూసీకి అత్యంత భారీ వరదలు.. 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టు, ఎక్కడంటే?

Future City: రేపే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.. దీని అద్భుతమైన ప్రత్యేకతలివే..

Hyderabad Flood: పురానాపూల్ శివాలయంలో చిక్కుకున్న నలుగురు సేఫ్.. కాపాడిన రెస్క్యూ టీం

New DGP Shivdhar Reddy: ఈ రెండు సమస్యల మీదే ఫుల్ ఫోకస్.. తెలంగాణ కొత్త DGP శివధర్‌రెడ్డితో ఎక్స్‌క్లూజివ్

Ponnam Prabhakar: దయచేసి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోకండి : మంత్రి పొన్నం

Musi River Floods: 1908 సెప్టెంబర్ 27.. మూసీ ఉగ్రరూపం.. ఆ రోజు ఏం జరిగిందంటే?

Traffic Jam: దసరా ఎఫెక్ట్.. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Dasara 2025: అయ్యయ్యో.. మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. దసరా రోజున వైన్‌షాపులు బంద్..!

Big Stories

×