BigTV English
Advertisement

Kannappa: ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షురూ.. వీడియో షేర్ చేసిన మంచు విష్ణు

Kannappa: ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షురూ.. వీడియో షేర్ చేసిన మంచు విష్ణు


Kannappa enters into second schedule: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ రూపొందుతోంది. పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నటుడు మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సుమారు రూ.150 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.


కాగా స్టార్ ప్లస్ టీవీలో ‘మహాభారత్‌’ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీలో ప్రభాస్ నటిస్తుండంతో ‘కన్నప్ప’పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు జోడీగా పార్వతి పాత్రలో నటి నయనతార కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్‌లు ఈ మూవీలో భాగం అయ్యారు. అలాగే మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త కూడా ఈ మూవీలో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా రెండో షెడ్యూల్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండో షెడ్యూల్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా పంచుకున్నారు.

అందులో మోహన్ బాబు సైతం జాయిన్ అయ్యారు. కాగా ఈ షెడ్యూల్ న్యూజిల్యాండ్లో జరుగుతున్నట్లు విష్ణు పేర్కొన్నాడు. ఇక అక్కడి అధికారులతో డిస్కస్ చేస్తున్న విజువల్స్ కూడా మంచు విష్ణు షేర్ చేసిన వీడియోలో కనిపిస్తుంది. దీని బట్టి ఈ మూవీ యమ స్పీడ్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×