E-Paper
Advertisement

KTR : కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సో సారీ అన్న గులాబీ కేడర్!

KTR : కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సో సారీ అన్న గులాబీ కేడర్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. గత సర్పంచ్ ఎన్నికలను ఆయన తన భుజాల మీద వేసుకుని ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ.. ఆ సమయంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఎప్పుడైతే అధికారానికి దూరం అయ్యిందో నాటి నుంచి బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నది. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని అంతా భావించారు. అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయ్యాయని.. మహిళలకు రూ.2500 ఇవ్వలేదని.. తులం బంగారం ఇచ్చారా? అని ఎంత ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం గులాబీ పార్టీ మాటలను పట్టించుకోలేదని ఫలితాలు నిర్దారించాయి.

మున్సిపల్ ఎన్నికల్లోనూ అంతేనా?

సర్పంచ్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఆ ఫలితాల్లో నెగెటివ్ ఫలితాలు రావడంతో జిల్లాల పర్యటనలు చేపట్టారు. కేడర్‌కు తాను అండగా ఉంటానని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా కేడర్, నేతలను సమన్వయం చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. మున్సిపల్ ఎన్నికల కోసం కేడర్, నాయకత్వాన్ని ప్రిపేర్ చేస్తున్న తరుణంలో ఏకంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సిట్ నోటీసులు వెంటాడాయి.దీంతో ఆయన ఎన్నికల ప్రిపరేషన్‌కు దూరం అయ్యారు. ముందుగా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు, ఆ తర్వాత కేటీఆర్.. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోశ్ రావు, ఆ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిందరి స్టేట్మెంట్స్ రికార్డు చేసింది.

సొంత కేడర్ హ్యాండ్ ఇచ్చిందా?

తీరా చూస్తే మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీనే జిల్లా ఇన్‌చార్జిలను ఆలస్యంగా నియమించింది. ఇకపోతే వారికి దిశానిర్దేశం చేయడంలో కేటీఆర్ విఫలమైనట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నేడు మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా..నిన్న ‘సారీ రామన్న’ పేరుతో ఓ కరపత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులో ఏముందంటే.. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ కేడర్ ఆయనకు దూరం అవుతున్నట్టు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వలేమని దాని సారాంశం.ఏకంగా తన సొంత సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ కేడర్ మద్దతు కోల్పోవడం చిన్నవిషయం కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లకు, అక్కడి నేతల కార్మికుల కోసం చాలానే చేశారు.

Telangana Muncipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

అయితే, సిరిసిల్లలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని.. స్థానిక లీడర్లు తమను పట్టించుకోవడం లేదని..అడ్డగోలుగా దోచుకు తింటునర్నారని కేడర్ కరపత్రం ద్వారా తమ సమస్యలను విడుదల చేసినట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఈసారి మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా స్పందించలేదు. అసలు ఆ కరపత్రం ఎక్కడిది? ఎవరు విడుదల చేశారు? అది ఒరిజినలా? లేక ప్రత్యర్థి పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి అలా చేశాయా? అని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కేటీఆర్ స్పందిస్తే గానీ ఈ విషయంపై క్లారిటీ రానుంది.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×