E-Paper
Advertisement

Telangana Municipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

Telangana Municipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు
Advertisement

Telangana Municipal Elections 2026:  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 52,17,413 మంది (పురుషులు – 25,49,750, మహిళలు – 26,67,025) ప్రజలు ఓటు వేయనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భగా ప్రతీ ఒక్కరూ మందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మరోవైపు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

11 గంటల వరకూ పోలింగ్ ఎంతంటే?

తెలంగాణ మున్నిపల్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకూ 28.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఈసీ సూచించింది.

పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు..

Advertisement

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్ధన్నపేట మున్సిపల్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు నర్సాపూర్ మున్సిపాలటీ 15వార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. గల్లాలు పట్టుకొని ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితులను అదుపుచేశారు.

బీఆర్ఎస్ ప్రలోభాలు

పలు వార్డుల్లో ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టబ్బులు పంచుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టగా.. అభ్యర్థి బంధువులు నగదును అక్కడే వదిలేసి పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Ex-Showroom vs On Road Price: ఎక్స్ షోరూమ్ ధరతో పోల్చితే, ఆన్ రోడ్ ధర ఎక్కువ.. కారణం ఏంటో తెలుసా?

బీజేపీ రెబల్ అభ్యర్థి కంటతడి

జగిత్యాలలో పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్ కంటతడి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థి దొంగ ఓటర్లకు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు శ్రీధర్ ను వారించే ప్రయత్నం చేశారు.

Also Read: 55 inch Smart TV: రూ.30000 కంటే తక్కువ ధరలో 55 ఇంచ్ స్మార్ట్‌టివి.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×