Padma Shri 2026:
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు రాష్ట్రాలకు భారీ ప్రాధాన్యత లభించింది. ఈ ఏడాది మొత్తం 113 మందికి పద్మశ్రీ, ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో నిలిచారు.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, ఈ ఏడాది మొత్తం 45 మంది వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీ జాబితాలో తెలుగు నేల నుండి మొత్తం 11 మంది ప్రముఖులు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. కళా విభాగంలో నటులు రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీ మోహన్, కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డిలకు ఈ గౌరవం దక్కింది. ఆధ్యాత్మిక సంగీతంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, సాహిత్యంలో వెంపటి కుటుంబ శాస్త్రిలు తమ ముద్ర వేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో డాక్టర్ తంగరాజ్, గడ్డమనుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్లు గుర్తింపు పొందగా, వైద్య రంగంలో విజయ్ ఆనంద్‌రెడ్డి, పాడి పరిశ్రమలో మామిడి రామరెడ్డిలు పురస్కారాలకు ఎంపికయ్యారు.
దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ రంగాల్లోని దిగ్గజాలకు పద్మ విభూషణ్ వరించింది. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, మలయాళ దిగ్గజం మమ్ముట్టి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. క్రీడా విభాగంలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ లభించడం క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది
అంకే గౌడ (సామాజిక సేవ – గ్రంథాలయాల స్థాపన)
అర్మిడా ఫెర్నాండెజ్ (వైద్యం – నవజాత శిశువుల సంరక్షణ)
భగవాన్ దాస్ రైక్వార్ (సామాజిక సేవ – పర్యావరణ పరిరక్షణ)
భిక్ల్యా లడక్యా ధిండా (సామాజిక సేవ – గిరిజన సంక్షేమం)
బ్రిజ్ లాల్ భట్ (సాహిత్యం మరియు విద్య)
బుధ్రీ తాతి (సామాజిక సేవ – గిరిజన హక్కులు)
చరణ్ హెంబ్రం (సాహిత్యం మరియు విద్య – సంతాలీ భాష)
చిరంజీ లాల్ యాదవ్ (కళలు – జానపద సంగీతం)
ధార్మికలాల్ చునీలాల్ పాండ్యా (సాహిత్యం మరియు విద్య)
గఫ్రుద్దీన్ మేవాటి జోగి (కళలు – సాంప్రదాయ సంగీతం)
హల్లీ వార్ (కళలు – జానపద నృత్యం)
ఇందర్జిత్ సింగ్ సిద్ధూ (సామాజిక సేవ – విద్యా వ్యాప్తి)
కె. పజనివెల్ (కళలు – నాదస్వరం)
కైలాష్ చంద్ర పంత్ (సాహిత్యం, విద్య)
ఖేమ్ రాజ్ సుంద్రియాల్ (కళలు – లోక్ గీత్)
కొల్లాక్కయిల్ దేవకి అమ్మ జి (సామాజిక సేవ – అడవుల పెంపకం)
డా. కుమారస్వామి తంగరాజ్ (సైన్స్ మరియు ఇంజనీరింగ్ – జన్యుశాస్త్రం)
మహేంద్ర కుమార్ మిశ్రా (సాహిత్యం మరియు విద్య – జానపద సాహిత్యం)
మీర్ హాజీభాయ్ కాసంభాయ్ (సామాజిక సేవ)
మోహన్ నగర్ (సాహిత్యం మరియు విద్య)
నరేష్ చంద్ర దేవ్ వర్మ (కళలు – లలిత కళలు)
నీలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా (సామాజిక సేవ – అనాథల సంరక్షణ)
నూరుద్దీన్ అహ్మద్ (కళలు – శిల్పకళ)
ఓతువర్ తిరుతాని స్వామినాథన్ (కళలు – ఆధ్యాత్మిక సంగీతం)
పద్మ గుర్మెట్ (వైద్యం – లడఖీ సాంప్రదాయ వైద్యం)
పోఖిలా లెక్తేపి (సామాజిక సేవ)
పున్నియమూర్తి నటేశన్ (వైద్యం – గ్రామీణ ఆరోగ్యం)
ఆర్. కృష్ణన్ (కళలు – పెయింటింగ్)
రఘుపత్ సింగ్ (క్రీడలు – అథ్లెటిక్స్)
రఘువీర్ తుకారాం ఖేద్కర్ (కళలు – తమాషా జానపద కళ)
రాజస్థాపతి కాళియప్ప గౌండర్ (కళలు – శిల్పకళ)
మామిడి రామరెడ్డి (పాడి మరియు పశుసంవర్ధక రంగం)
రామచంద్ర గోడ్బోలే & సునీత గోడ్బోలే (సామాజిక సేవ – జంటగా సేవా కార్యక్రమాలు)
ఎస్ జి సుశీలమ్మ (సామాజిక సేవ – మహిళా సాధికారత)
సంగ్యుసాంగ్ ఎస్ పోంగనర్ (సాహిత్యం మరియు విద్య)
షఫీ షాక్ (సాహిత్యం మరియు విద్య)
శ్రీరంగ్ దేవబా లాడ్ (కళలు – జానపద కళలు)
శ్యామ్ సుందర్ (సామాజిక సేవ)
సిమాంచల్ పాత్రో (కళలు – నాటక రంగం)
సురేష్ హనగవాడి (వైద్యం – రక్తహీనత నివారణ)
టగా రామ్ భీల్ (కళలు – జానపద సంగీతం)
టెచి గుబిన్ (సామాజిక సేవ)
తిరువారూర్ భక్తవత్సలం (కళలు – మృదంగం)
విశ్వ బంధు (సాహిత్యం మరియు విద్య)
యుమ్నం జాత్రా సింగ్ (కళలు – మణిపురి నృత్యం)