BigTV English

Congress Ugadhi Celebrations: ఆయన జాతకం అత్యంత అమోగం.. ఆయనను ఎవ్వరూ ఏమి చేయలేరు.. రేవంత్‌పై పంచాగకర్త కీలక వ్యాఖ్యలు!

Congress Ugadhi Celebrations: ఆయన జాతకం అత్యంత అమోగం.. ఆయనను ఎవ్వరూ ఏమి చేయలేరు.. రేవంత్‌పై పంచాగకర్త కీలక వ్యాఖ్యలు!


Congress Ugadhi Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో ఉగాది వేడుకలను జరుపుకుంది. వేడుకల అనంతరం పంతులు చిలుకూరి శ్రీనివాస మూర్తి పంచాగ శ్రవణం గురించి చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఎవ్వరూ ఏమి చేయలేరని అన్నారు. ఆయన భవిష్యత్తు అత్యంత అమోగంగా ఉందని పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సరంలో మరింత ఉత్సాహం, వేగంతో పనిచేస్తారని వెల్లడించారు. అప్పటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం పరుశరాముడి మాదిరిగా పని చేస్తారని అన్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అయోధ్యలో రామ ప్రతిష్ట జరగడం అత్యంత శుభసూచకం అని తెలిపారు. సింహానికి ఆకలేస్తే ఎలా ఉంటుందో, రేవంత్ రెడ్డి కూడా అచ్చం అలాగే ఉంటారని అన్నారు.


Also Read: ప్రభుత్వం మారినా మక్కువ పోలే.. చివరకు సస్పెన్షన్ వేటు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతకంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యోగం బాగుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఊహించని విధంగా ఉంటాయని అన్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలతో వివాదాలు ఉన్నా.. మన రాష్ట్రానిదే పైచేయి అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×