BigTV English
Advertisement

IPL 2024 PBKS Vs SRH Highlights: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం.. పోరాడి ఓడిన పంజాబ్!

IPL 2024 PBKS Vs SRH Highlights: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం.. పోరాడి ఓడిన పంజాబ్!
IPL 2024 PBKS vs SRH Live Updates
IPL 2024 PBKS vs SRH Live Updates

IPL 2024 Punjab Kings Vs Sunrisers Hyderabad Highlights: ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. శశాంక్ సింగ్(46*, 25 బంతుల్లో), అశుతోష్ శర్మ(33*, 15 బంతుల్లో) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సునాయాసంగా నెగ్గాల్సిన పోరులో హైదరాబాద్ చెమటోడ్చి నెగ్గింది.


అంతకుముందు తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(64, 37 బంతుల్లో) చెలరేగడంతో సన్‌రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

పోరాడిన శశాంక్, అశుతోష్

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఎదురుదెబ్బ్ తగిలింది. బెయిర్‌స్టో కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే 4 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5వ ఓవర్లో 14 పరుగులు చేసిన ధావన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది.


Also Read: IPL 2024 RR vs GT Live Updates: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్..

సామ్ కర్రన్(27) 4వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 28 పరుగులు చేసిన సికిందర్ రాజా ఉనద్కత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 91 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జితేశ్ శర్మ(19) కొంచెంసేపు ప్రతిఘటించాడు. చివరకు నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. ఈ దశలో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ చెలరేగారు. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు రాబట్టారు. 12 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్లో 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులను సిక్స్‌గా మలిచాడు అశుతష్ శర్మ. చివరి బంతికి 9 పరుగులు అవసరం పడగా సిక్స్ కొట్టడంతో సన్‌రైజర్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అదరగొట్టిన నితీశ్ రెడ్డి

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో చేశారు. జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద హెడ్(21) భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ధావన్‌కు చిక్కాడు. అదే ఓవర్లో ఫామ్‌లో ఉన్న మార్క్‌రమ్ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ స్కోర్ 39 పరుగుల వద్ద అభిషేక్ శర్మ(16) సామ్ కర్రన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత రాహుల్ త్రిపాఠి(11), క్లాసెన్(9) వెంటవెంటనే అవుట్ అయ్యారు.

Also Read: Mumbai Indians: ముంబైకి షాక్ మీద షాక్..

Unsung Hero Nitish Reddy

ఈ దశలో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బ్రర్ వేసిన 15వ ఓవర్లో 4,6,4,6 కొట్టి మొత్తంగా ఆ ఓవర్లో 22 పరుగులు సాధించాడు. అదే ఓవర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో వైపు సమద్(25) చెలరేగాడు. కానీ ఒకే ఓవర్లో సమద్, నితీశ్(64) వికెట్లను హైదరాబాద్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన కమిన్స్ 3 పరుగులు మాత్రమే చేసి రబాడ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ చెలరేగడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

Tags

Related News

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

Big Stories

×