E-Paper
Advertisement

Hydra: హైడ్రా రద్దు చేయాలని పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

Hydra: హైడ్రా రద్దు చేయాలని పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
Advertisement

High Court Key Instructions to Govt : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైనా పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషనర్ జీఓ 99ను ఛాలెంజ్ చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ యాక్ట్‌ను కాదని హైడ్రాకు ఎలా అధికారులు ఇస్తారని పిటిషనర్ పేర్కొన్నారు. హైడ్రా చట్టబద్దతను రద్దు చేయాలని కోరారు.

హైడ్రాపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

అలాగే హైడ్రాను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీఓ 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్ పూర్‌లో కొన్ని షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read: ఆగమయ్యాం.. ఆదుకోండి: కేంద్ర బృందానికి సీఎం రేవంత్ వినతి

Advertisement

ఇదిలా ఉండగా, హైడ్రా ఇప్పటివరకు చెరువుల ఎప్టీఎల్ పరిధిలోని వ్యాపార అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. తుమ్మడి కుంట ఎన్ కన్వెన్షన్ తో పాటు అప్పా చెరువులోని అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేసింది.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×