BigTV English

Malaika Father Suicide: అనిల్ ఆత్మహత్యకు ముందు జరిగింది ఇదే.. అసలు విషయం చెప్పిన మలైకా మదర్!

Malaika Father Suicide: అనిల్ ఆత్మహత్యకు ముందు జరిగింది ఇదే.. అసలు విషయం చెప్పిన మలైకా మదర్!

Salman Khan Visits Malaika Home: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా సెప్టెంబర్ 11న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని తన నివాసం టెర్రస్ నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నారు. అనిల్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన సతీమణి జాయిస్ పాలీకార్ప్ ఇంట్లోనే ఉన్నారు. తాజాగా ఆయన ఆత్మహత్యకు సంబంధించి మలైకా మదర్ జాయిస్ కీలక విషయాలు వెల్లడించింది.


ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందో చెప్పిన జాయిస్

అనిల్ కిందకు దూకిన కొద్ది సేపటికి.. ఆయన గదిలోకి వెళ్లి చూశానని  జాయిస్ పోలీసులకు వెల్లడించింది. గదిలో ఆయన చెప్పులు మాత్రమే కనిపించాయని, ఆయన కనిపించకపోవడంతో గది అంతా వెతికినట్లు చెప్పారు. కాసేపటి తర్వాత వాచ్ మెన్ గట్టిగా అరవడంతో బాల్కనీలో నుంచి కిందకు చూశానని.. అప్పటికే అనిల్ రక్తం మడుగులో పడి ఉన్నట్లు కనిపించిందన్నారు.


అటు పోస్టుమార్టం రిపోర్టులో అనిల్ తలతో పాటు శరీరంలోని పలు అవయవాలకు బలమైన గాయాలై చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అనిల్ ఆత్మహత్యకు ముందు తన ఇద్దరు కూతుళ్లు మలైకా, అమృతకు కాల్ చేసి మాట్లాడారు. తాను అనారోగ్యంతో అలసిపోయానని చెప్పారు. ఆ తర్వాత తన ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశారు. ఈ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: వేణుస్వామిపై కేసు నమోదుకు ఆదేశాలు.. వివాదాస్పద జ్యోతిష్యుడికి నాంపల్లి కోర్టు ఝలక్!

మలైకా ఎమోషనల్ స్టేట్మెంట్

తన తండ్రి చనిపోయిన తర్వాత మలైకా అరోరా ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. “మా తండ్రి అనిల్ మెహతా చనిపోయినందుకు ఎంతో బాధపడుతున్నాం. అతడు చాలా సున్నితమైన వ్యక్తి. అంకితభావం ఉన్న తాత, ప్రేమగల భర్త, మా బెస్ట్ ఫ్రెండ్. ఆయన చనిపోయారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన లేకపోవడం మాకు తీరనిలోటు. ఈ కష్ట సమయంలో మేం ప్రైవసీని కోరుకుంటున్నాం” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మలైకా కుటుంబ సభ్యులను పరామర్శించిన సల్మాన్

అనిల్ మెహతా చనిపోయిన నేపథ్యంలో  సల్మాన్ ఖాన్ మలైకా అరోరా ఇంటికి వెళ్లారు. మెహతా కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధలో ఉన్న వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కాసేపు మలైకా కుటుంబ సభ్యులతో గడిపారు.

మలైకా కుటుంబంతో సల్మాన్ కు సుధీర్ఘ అనుబంధం

మలైకా అరోరా కుటుంబంతో సల్మాన్ ఖాన్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. మలైకాను సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. సుమారు 19 సంవత్సరాలు కలిసి ఉన్నారు.  2016లో పలు కారణాలతో వారిద్దరు విడిపోయారు.

అయినప్పటికీ మలైకా, సల్మాన్ ఖాన్ కుటుంబం మధ్య బంధం బలంగానే ఉంది. అనిల్ మరణ వార్త తెలియగానే అర్బాజ్ మలైకా ఇంటికి వచ్చారు. దగ్గరుండి ఫార్మాలిటీస్ చూసుకున్నారు. కష్ట సమయంలో మలైకాకు ఓదార్పునిచ్చింది. అనిల్ అంత్యక్రియల్లో మలైకా తన కుమారుడు అర్హాన్ తో కలిసి పాల్గొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×