BigTV English

Facts: ఫ్లైట్‌లోకి ఎడమ వైపు నుంచే ఎందుకు ఎక్కుతారు? ఇదీ కారణం

Facts: ఫ్లైట్‌లోకి ఎడమ వైపు నుంచే ఎందుకు ఎక్కుతారు? ఇదీ కారణం

why boarding plane from left side is in practice: మనం చాలా విషయాలు పెద్దగా పట్టించుకోకుండానే చేసేస్తుంటాం. మన దృష్టికి ఆలోచించేస్థాయిలో చాలా విషయాలు తాకవు. ఫ్లైట్‌లోకి ఎడమ వైపు నుంచి ఎక్కుతాం. కానీ, ఎడమ వైపునే ఎందుకు డోర్ ఉంటుంది? కుడి వైపు నుంచి ఎందుకు ఎక్కము? అన్ని ఎయిర్‌లైన్ల ఫ్లైట్లు, ప్రపంచంలోని విమానాశ్రయాలన్నీ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి బోర్డింగ్‌ కల్పించే రీతిలోనే ఎందుకు ఉన్నాయి? ఇందుకు ఓ కారణం ఉన్నది. అదేమిటో చూద్దాం.


ఈ కారణం తెలియాలంటే మానవులు ప్రయాణాలకు, సరుకును సరఫరా చేయడానికి ఓడను ఉపయోగించినప్పటి కాలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో పడవకు వేర్వేరు వైపుల నుంచి సరుకును లోడ్ చేస్తే.. అన్‌లోడింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అన్ని పోర్టుల్లో ఓడను ఎడమ వైపున నిలిపే విధానం ఉంటే.. అప్పుడు లోడ్ చేసేటప్పుడే ఏ సరుకు ఏ చోట పెట్టాలనే ఐడియా ఉంటుంది. ఇలా అప్పటి నిపుణులు ఎడమ వైపును ఇందుకు ఎంచుకున్నారు. అన్ని పోర్టుల్లో పడవ ఎడమ వైపు భాగం పోర్టుకు చేరగా.. కుడి వైపు సముద్రం వైపుగా ఉండేవి. అన్ని చోట్లా ఇదే విధానం అమల్లోకి వచ్చింది.

ఇంజినీర్లు ఇదే విధానాన్ని ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌ప్లేన్లకు ఎంచుకున్నారు. పడవ నుంచి విమానానికి మనం మారినప్పుడు అదే పాత విధానాన్నే తీసుకుని విమానానికి బోర్డింగ్ ఎడమ వైపున ఏర్పాటు చేశారు. ప్రతి విమానం.. ప్రపంచంలోని ప్రతి విమానాశ్రయం ఈ ఎడమ వైపు బోర్డింగ్ లేదా డీబోర్డింగ్‌కు అనుకూలంగా ఏర్పాటు చేసి ఉంటాయి. కాబట్టి, ప్రయాణికులు విమానం ఎక్కాలన్నా, దిగాలన్నా ఎడమ వైపు నుంచే వెళ్లాల్సి ఉంటుంది.


Also Read: Telangana Floods: ఆగమయ్యాం.. ఆదుకోండి: కేంద్ర బృందానికి సీఎం రేవంత్ వినతి

ఈ విషయాన్ని వైమానిక నిపుణులు కూడా అంగీకరించారు. ఏవియేషన్ హిస్టారియన్ మైకేల్ ఓక్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి చాలా విధానాలు ఈ ఏవియేషన్ హిస్టరీకి ముందు నుంచే అంటే.. పడవల కాలం నుంచే ఉన్నాయని, అవి ఆ తర్వాత విమానరంగంలోనూ అమల్లోకి వచ్చాయని తెలిపారు. అంతేకాదు, విమానరంగంలోని అనేక మాటలు కూడా నౌకయానంలో నుంచి వచ్చినవే అని పేర్కొన్నారు. పడవల్లాగే.. విమానాలకు కూడా ఎడమ వైపే బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుందని వివరించారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×