E-Paper
Advertisement

Porsche car accident in Hyderabad: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్, తప్పిన ముప్పు..

Porsche car accident in Hyderabad: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం, ఎయిర్  బెలూన్స్ ఓపెన్, తప్పిన ముప్పు..
Advertisement

Porsche car accident in Hyderabad: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ గోడను ఢీ కొట్టింది. వేగానికి కారు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు.

శుక్రవారం ఉదయం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి చెక్ పోస్టు వైపు పోర్షే కారు వస్తోంది. ఆ ప్రాంతం డౌన్‌‌గా ఉండడంతో కారు డ్రైవర్ మరింత వేగాన్ని పెంచాడు. చిన్న టర్నింగ్ తీసుకునే క్రమంలో నేరుగా వెళ్లి కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టి ఆగింది కారు.

Advertisement

ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారుకి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని, క్రేన్ సాయంతో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.

ఇంతకీ కారు ఎవరిది? అన్నది ఆసక్తికరంగా మారింది. నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కారు ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. పోర్షే కారు బడాబాబులకు చెందినదిగా భావిస్తున్నారు పోలీసులు.

Advertisement

ALSO READ:  హిజ్రాల వీరంగం.. వ్యాన్ ఆపి డ్రైవర్‌పై దాడి

ఇలాంటి కారును డ్రైవర్‌కి ఇవ్వరని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, నెంబర్ ప్లేట్‌ను తీసుకొని వెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కారు ఎక్కడి నుంచి బయలు దేరింది? ఏయే ప్రాంతాల మీదుగా వచ్చింది? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.

 

కొద్ది నెలల కిందట పూణెలో కూడా పోర్షే కారు ఘటన జరిగింది. మైనర్ బాలుడు అర్థరాత్రి డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ బలైయ్యాడు. ఆ యువకుడు రాజకీయ నేత కొడుకు కావడంతో ఆ కేసు నుంచి తప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆ నేత అరెస్టయిన విషయం తెల్సిందే.

ఈ లెక్క హైదరాబాద్ పోర్షే కారు ఘటన వెనుక మైనర్ బాలుడు ఉన్నాడా? అన్న డౌట్‌ను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో తీగలాగితే ఎవరి డొంక కదులుతుందో చూడాలి.

 

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×