BigTV English
Advertisement

Nani : ఆ డైరెక్టర్ కు నాని మరో ఛాన్స్.. స్టోరీ లైన్ అదిరింది మామా..

Nani : ఆ డైరెక్టర్ కు నాని మరో ఛాన్స్.. స్టోరీ లైన్ అదిరింది మామా..

Nani: టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హాయ్ నాన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే నాని చేతిలో రెండు సినిమాలు ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ డైరెక్టర్ ఎవరో, గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


నాని నటించిన నిన్ను కోరి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 2017 లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో నానికి ప్లస్ అయ్యింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ గా వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా హిట్ అవ్వడంతో వీరిద్దరి కాంబోలో టక్ జగదీశ్ మూవీ వచ్చింది. ఆ మూవీ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు దాంతో సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా చెయ్యనున్నాడనే టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో మరో ప్రేమ కథా చిత్రం మూవీ రాబోతుందని వార్తలు గుప్పుమన్నాయి.

గత సినిమా డిజాస్టర్ అయినా మళ్లీ అదే డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం పై నాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మొన్న సినిమా ఫ్లాప్ అయ్యింది.. మళ్లీ ఇప్పుడు మరో సినిమా చెయ్యడం ఎందుకు అని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ నానిని ట్యాగ్ చేస్తున్నారు. మరి ఈ వార్త నిజమైతే మరి ఎలాంటి సినిమా చేస్తాడు.. నిన్ను కోరి టైం లో లవ్ ఎంటర్టైనర్ సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరి నాని ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.. ప్రస్తుతం హిట్ 3 చేస్తున్నాడు. ఆ తర్వాత సుజీత్ తో సినిమా కంటే ముందు నాని శివ నిర్వాణతో కలిసి పని చేస్తాడని టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అయితే ఆ సినిమా మూడు నెలల్లో పూర్తి అవుతుందని టాక్. 2026 లో సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో హేషమ్ మ్యూజిక్ ను అందించగా, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో న్యూ ఏజ్ స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇక నాని చేతిలో మరో మూడు సినిమాలు రాబోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను లైన్లో పెట్టుకుంటున్న నానితో సినిమాలు చెయ్యడానికి డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×