E-Paper
Advertisement

Janwada Farm House Case: జన్వాడ రేవ్ పార్టీ.. మోకిల పోలీసులు నోటీసులు, హైకోర్టులో రాజ్ పాకాల పిటిషన్

Janwada Farm House Case: జన్వాడ రేవ్ పార్టీ.. మోకిల పోలీసులు నోటీసులు, హైకోర్టులో రాజ్ పాకాల పిటిషన్
Advertisement

Janwada Farm House Case: జన్వాడ రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారా? ఈ కేసులో తీగ లాడితే డొంక కదులుతోందా? రేవ్ పార్టీ తర్వాత రాజ్ పాకాల ఎక్కడున్నారు? పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారా? అవుననే సంకేతాలు బలంగా వున్నాయి.

జన్వాడ రేవ్ పార్టీ వ్యవహారం కేటీఆర్ బావమదిరి రాజ్ పాకాల మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో మోకిల పోలీసులకు ఆయనకు నోటీసులు చేశారు. BNS 35 (3 ) సెక్షన్ ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో ప్రస్తావించారు పోలీసులు. ఈ రోజు తమ ముందు విచారణకు హాజరు కావాలన్నారు.

Advertisement

అడ్రస్ ప్రూఫ్‌తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు పోలీసులు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే BNS 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.

రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు పోలీసులు. మరోవైపు పోలీసుల నోటీసు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల. పార్టీ వ్యవహారంలో తనను పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా ప్రస్తావించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

Advertisement

 

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×