BigTV English

Census in India: 2025లో జనగణన షురూ.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన!

Census in India: 2025లో జనగణన షురూ.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన!

Census in India: జనగణనకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయ్యి.. 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి. ప్రతి పదేళ్లకోసారి నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.


రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ జనగణనే ఇంపార్టెంట్. అయితే 2021లో కొవిడ్‌ కారణంగా సెన్సస్‌ జరగలేదు. తర్వాత కూడా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొద్దినెలల క్రితం చెప్పారు. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో ప్రకటిస్తానని అన్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఈ సర్వే ఉంటుందని వెల్లడించారు.

గతేడాది ఏప్రిల్‌లో చైనాను మించిపోయి అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్య సమితి అనౌన్స్‌ చేసింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా మన దేశ జనాభా 2 కోట్లు ఎక్కువన్నది ఒక ఎస్టిమేషనే కానీ.. ఎగ్జాక్ట్‌ ఫిగర్స్‌ లేవు. వివిధ పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్‌ లెక్కలు వెల్లడించాయి.


Also Read: విమానాల ఉత్పత్తి మొదలు.. టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

సరైన గణాంకాలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే జనగణన ఒక కొలిక్కి వచ్చేదాకా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణా ఆగాల్సిందే. ఇదిలాఉంటే.. కులగణన గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర డిమాండ్లు వస్తున్నాయి. ఈ టైంలో లేటెస్ట్‌ న్యూస్‌ వచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం అఫీషియల్‌గా చెప్పాల్సి ఉంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×