రాజేశేఖర్ కుటుంబం ఆస్తులకోసం తగాదాలు పడటం బాధాకమని మాజీ మంత్రి బాలినేని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై మాట్లాడారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదని అన్నారు.
సమస్య పరిష్కారం కోసం విజయమమ ముందుకు రావాలని అన్నారు. వేరే ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. విజయమ్మతోనే ఆస్తుల విషయంలో పరిష్కారం దొరుకుతుందన్నారు బాలినేని
Also Read: డ్యాన్స్ అదరగొట్టిన డ్రైవర్.. లోకేష్ ట్వీట్.. ఆ తర్వాత జాబ్?
చంద్రబాబుకు, కూటమికి వీరి ఆస్తుల విషయానికి సంబందం లేదన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండటం సరైంది కాదన్నారు బాలినేని
వైసీపీలో ఉన్నపుడు తన ఆస్తులు పోగొట్టుకున్నట్లు… సంపాదించింది ఏమి లేదని బాలినేని చెప్పారు.. ఆ విషయం జగన్‌ని కూడా తెలుసన్నారు బాలినేని. ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ విషయాన్ని బయట పెట్టలేదన్నారు.