BigTV English

RevanthReddy: ఎల్లవ్వకు ఇల్లు.. రేవంత్ మాటంటే మాటే.. కేసీఆర్‌లా కాదు..!

RevanthReddy: ఎల్లవ్వకు ఇల్లు.. రేవంత్ మాటంటే మాటే.. కేసీఆర్‌లా కాదు..!
REVANTH REDDY ellavva

Revanth reddy news congress(Latest news in telangana): ఆ వృద్ధురాలి కల.. ఓ పక్కా ఇల్లు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా చెత్తబుట్టకే చేరింది. ఆమె కల నెరవేరే దారే దొరకలేదు. ఆ సమయంలోనే ఆమె గోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చేరింది. ఆమెకు పక్కా ఇల్లు కట్టిస్తానని.. పక్కాగా హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి మాటిచ్చారంటే.. అదిక లాక్ చేసుకోవాల్సిందే. చెప్పినట్టుగానే ఆ వృద్ధురాలికి ఇల్లు కట్టించారు. ఆమె ఇంటి గృహప్రవేశానికి కూడా హాజరయ్యారు.


మేడ్చల్ జిల్లా ముడిచింతలపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిస్తానని రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సహకారంతో ఇల్లు నిర్మితమైంది. ఈరోజు గృహప్రవేశానికి సైతం హాజరయ్యారు. తన ఇంటి కోసం అనేక సార్లు దరఖాస్తు పెట్టుకున్న మంత్రి మల్లారెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని… కాంగ్రెస్ పార్టీకి తాను రుణపడి ఉంటాననన్నారు ఎల్లవ్వ. రేవంత్‌రెడ్డి తన పెద్ద కొడుకులా మారాడని.. ఆయన చల్లగా బ్రతకాలని దీవించింది ఆ వృద్ధరాలు.

ఎల్లవ్వకు కట్టించినట్టుగానే.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు వేయమని అడుగుతామని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన చోట సీఎం కేసీఆర్ ఓట్లు అడగాలని.. పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన చోట బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ దక్కితే.. కాంగ్రెస్ అభ్యర్థులు గుండు కొట్టించుకుంటారని చెప్పారు రేవంత్ రెడ్డి.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×