BigTV English

Keerthi with Akkineni Hero : అక్కినేని హీరోతో కీర్తి జోడీ.. తొలిసారిగా..

Keerthi with Akkineni Hero : అక్కినేని హీరోతో కీర్తి జోడీ.. తొలిసారిగా..
keerthi suresh


Keerthi with Akkineni Hero(Tollywood movie updates) : ఒక్కసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న తర్వాత.. హీరోయిన్లను కమర్షియల్ సినిమాల కోసం ఎక్కువగా పరిగణలోకి తీసుకోరు. అటు కమర్షియల్ సినిమాలు, ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. రెండు బ్యాలెన్స్ చేసిన నటీమణులు సినీ పరిశ్రమలో చాలా తక్కువమంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో జాయిన్ అవ్వడానికి అన్ని అర్హతలు సంపాదించుకుంటోంది కీర్తి సురేశ్.

కీర్తి సురేశ్ అంటే ప్రేక్షకులు అందరికీ టక్కున గుర్తొచ్చేది మహానటి సినిమా. కీర్తి కెరీర్ ప్రారంభంలోనే మహానటి సినిమా ఆఫర్ కొట్టేసి, అందులో తన నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. అలనాటి మహానటి సావిత్రిని తలపించేలా కీర్తి నటన అద్భుతంగా ఉందంటూ అందరూ మెచ్చుకున్నారు. అంతే కాకుండా నేషనల్ అవార్డ్ తన చేతిలో పెట్టారు. అప్పటినుండి కీర్తికి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ఆఫర్లు వచ్చాయి.


మహానటితో కెరీర్‌లో పీక్స్ చూసిన కీర్తి.. ఆ తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో వరుసగా ఫ్లాపులను చవిచూసింది. దీంతో మళ్లీ కమర్షియల్ సినిమా ఆఫర్లను ఒప్పుకోవడం మొదలుపెట్టింది. అలా మహేశ్ బాబుతో నటించిన సర్కారు వారి పాటతో మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చింది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ కథలకు కూడా ఓకే చెప్తోంది. తాజాగా అక్కినేని హీరోతో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుందట ఈ మహానటి.

ప్రస్తుతం అక్కినేని హీరోలు అందరూ ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ చిత్రం తనను నిరాశపరిచింది. అందుకే మళ్లీ యంగ్ డైరెక్టర్లతోనే తన లక్‌ను టెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అదే క్రమంలో చందూ మొండేటి చెప్పిన పీరియాడిక్ లవ్ స్టోరీ కథకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా ఇందులో నాగచైతన్యతో తొలిసారి కీర్తి స్క్రీన్ షేర్ చేసుకోనుంది అని వార్తలు వైరల్ అయ్యాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×