E-Paper
Advertisement

స్వేచ్ఛ ఎఫెక్ట్.. నల్లవాని కుంట అక్రమాలపై కదిలిన యంత్రాంగం

స్వేచ్ఛ ఎఫెక్ట్.. నల్లవాని కుంట అక్రమాలపై కదిలిన యంత్రాంగం
Advertisement

Swetcha Effect: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామం సర్వే నంబర్ 80లో నల్లవాని కుంట వద్ద జరుగుతున్న రహదారి విస్తరణ పనులపై స్వేచ్ఛలో వచ్చిన కథనం ప్రభావంతో అధికారులు రంగంలోకి దిగారు. కుంట ఆక్రమణ, చెట్ల నరికివేతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.

రహదారి విస్తరణ

ఈ క్రమంలో నల్లవాని కుంట వద్ద డీఈ జైపాల్ కుమార్ ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్ స్పెక్టర్ ఈషారత్ లు శనివారం స్థలాన్ని పరిశీలించారు. కుంట పరిధిలో జరుగుతున్న పనులు, రహదారి విస్తరణ పరిస్థితులను దగ్గరగా పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయా? కుంట పరిధి దెబ్బతింటుందా? అనే అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టినట్లు సమాచారం.

Advertisement

Also read: విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!

చర్యలు తప్పవని స్పష్టం

స్థానికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, కుంట పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా పనులు జరిగితే తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం.కాగా, కుంటను ఆక్రమిస్తూ రహదారి విస్తరణ చేపట్టారన్న ఆరోపణలపై విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిసింది.

Advertisement

Also read: మందుబాబుల వినూత్న ఆలోచన.. పోలీసులకే షాకిచ్చిన వాట్సాప్ గ్రూప్, ఎస్‌ఐ ఎంటర్ అవ్వడంతో..?

Related News

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×