BigTV English

Warangal Caught: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్‌లు, ఆ తర్వాత.. రెచ్చిపోయిన ఉద్యోగులు

Warangal Caught: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్‌లు, ఆ తర్వాత.. రెచ్చిపోయిన ఉద్యోగులు

Warangal Caught: అసాంఘిక కార్యకలాపాలకు, రాసలీలలకు అడ్డగా మారుతు న్నాయి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు. ఏవరేమనుకున్నా పట్టించుకోవడంలేదు. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత సుఖాల కోసం, లైంగిక కోర్కెలు తీర్చుకు నేందుకు షెల్టర్లుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అలాంటి యవ్వారం ఒకటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది.


గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో ఆఫీసు కళకళలాడుతూ ఉంటుంది.  సమయం సాయంత్రానికి కావస్తోంది. సిబ్బంది ఒకొక్కరుగా ఇంటికి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఇదే అదునుగా భావించారు ఆ ఇద్దరు ఉద్యోగులు. తమ లైంగిక కోర్కెలు తీసుకోవడం మొదలుపెట్టారు. తాము ప్రభుత్వం ఆఫీసులో పని చేస్తున్నామనే విషయాన్ని మరచిపోయారు.

ఎవరైనా చూస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని, తమ జీవితాలకు ఇబ్బందిగా మారుతుందని ఏ మాత్రం ఆలోచించలేదు.  తమ పనుల్లో బిజీ అయిపోయారు. విధుల్లో ఉండగానే లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఏవేవో చేశారనుకోండి, అదే వేరే విషయం. ఇద్దరు ఉద్యోగులు క్లోజ్‌గా ఉండటాన్ని బయట తిరుగుతున్న వ్యక్తులు గమనించారు.


ఇంకేముందు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ చేతులో ఉన్న సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఉద్యోగులిద్దరు షాకయ్యారు.  వారిద్దరికి పైస్థాయి అధికారులు గట్టిగానే మందలించారు.  ఇటీవల వారు ఉద్యోగంలోకి చేరినట్టు ఆఫీసు అధికారులు మాట. మొత్తానికి ఆఫీసుకు వచ్చిన కొత్తలో వారు రెచ్చిపోయారు.

ALSO READ: కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల, పెద్దాయనను కాపాడుతారా?

ఇదేంకాదు.. రెండువారాల కిందట ఏపీలోని విజయవాడ టూరిజం ఆఫీసులో ఇలాగే జరిగింది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఆఫీసును తన కోర్కెలను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు ఓ ఉద్యోగి.  రాత్రి కాగానే రోజుకో మహిళను ఆఫీసుకు తీసుకొచ్చి తన వ్యక్తిగత సుఖాలు తీర్చుకునేవాడు.  అదే కంటిన్యూ చేయడంతో సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది.

చివరకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అడ్డంగా బుక్కయ్యాడు ఆ ఉద్యోగి. ఇలా చెప్పుకుంటే పోతే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలు చాలానే బయటకు వచ్చాయి. అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయన్న విషయాన్ని ఉద్యోగులు మరిచిపోకూడదని అంటున్నారు.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×