Single OTT: సాధారణంగా సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా.. ఓటిటిలోకి వస్తున్నాయి అని అంటే ఆ హడావిడి వేరుగా ఉంటుంది. అందులోనూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సినిమా అయితే మేకర్స్.. ఓటీటీ ప్రమోషన్స్ కూడా చేస్తారు. కానీ, ఈ మధ్య రిలీజ్ అయిన హిట్ సినిమా సింగిల్ సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమై షాక్ ఇచ్చింది.
టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం సింగిల్.గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటించగా వెన్నెల కిషోర్ కీలకపాత్రలో కనిపించాడు. మే 9న రిలీజ్ అయిన సింగిల్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. తన కామెడీ తో శ్రీ విష్ణు ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారినా మీమ్స్ అన్నింటిని సినిమాలో వాడేశారు.
ఎప్పుడెప్పుడు సింగిల్ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ కనిపించింది. తెలుగులోనే కాకుండా ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవడం విశేషం. అయితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా సడన్ గా సింగిల్ ఓటీటీ కి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సింగిల్ సినిమాను థియేటర్లో మిస్ అయినవాళ్లు అమెజాన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సింగిల్ సినిమా కథ వస్తే విజయ్(శ్రీవిష్ణు) ఒక బ్యాంకు ఉద్యోగి. ఏజ్ పెరుగుతున్నా పెళ్లి కావడం లేదని బాధపడే అతనికి మెట్రో స్టేషన్ ల పూర్వ(కేతిక శర్మ) కనిపిస్తుంది.మొదటి చూపులోనే ప్రేమలో పడిన విజయ్ ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్) తో కలిసి నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఇక ఇంకోపక్క విజయ్ ను హరిణి(ఇవానా) సీక్రెట్ గా ప్రేమిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అమ్మాయిల మధ్య విజయ్ ఎలా ఇరుక్కున్నాడు. చివరకు తన ప్రేమను గెలిపించుకున్నాడా.. ? విజయ్ కు, హరిణికి ఉన్న బంధం ఏంటి.. ? అనేది సినిమాలో చూడాల్సిందే.
సింగిల్.. ఒక నార్మల్ ముక్కోణపు ప్రేమ కథ. అబ్బాయి.. ఒక అమ్మాయి వెంట పడతాడు. ఇంకో అమ్మాయి ఆ అబ్బాయి వెంట పడుతుంది. ఇదే సినిమా లైన్. కానీ, ఈ నార్మల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీని జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు కార్తీక్. ఇక ప్రతి కథలో కూడా చివర్లో సింగిల్ గా ఉన్న హీరో మింగిల్ గా మారతాడు. కథ సుఖాంతం అవుతుంది అనే అనుకోని క్లైమాక్స్ వరకు వెయిట్ చేస్తాం. కానీ, సింగిల్ క్లైమాక్స్ ని మొత్తం డైరెక్టర్ మార్చి రాసేశాడు. అక్కడే రొటీన్ సినిమా కాదు అనిపించేలా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్ లో హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.