E-Paper
Advertisement

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!
Advertisement

A1 Ginger Garlic: స్వేచ్ఛ బ్యూరో : ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల తయారీలో ఇంత నిర్లక్ష్యమా? ఫంగస్‌ పట్టి కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించడం కలకలం రేపింది. మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో ‘ఏ1’ బ్రాండ్‌ తయారీ కేంద్రంపై శుక్రవారం ఉదయం ఎస్‌ఓటీ, టీజీసీఎఫ్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో ‘22 కిలోల కుళ్లిన వెల్లుల్లి, 50 కిలోల అల్లం’ గుర్తించినట్లు మేడ్చల్‌–కుత్బుల్లాపూర్‌ జోన్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అమృత శ్రీ వెల్లడించారు.

అధికారుల హెచ్చరికలు..

Advertisement

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వినియోగానికి పనికిరాని ముడి పదార్థాలతో అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి ‘ఏ1’ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తుల నమూనాలను అధికారులు సేకరించారు.ఆహార పదార్థాల తయారీకి అవసరమైన లైసెన్స్‌లు తీసుకోవడంతోపాటు పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే ఉత్పత్తులు తయారు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆహార కల్తీ కనిపిస్తే ఫిర్యాదు చేయండి

Advertisement

పాలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ సహా ఇతర ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు ఉంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబరు: 9100105795కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అమృత తెలిపారు.

Also Read:నామినేషన్ల గడువు 48 గంటలు పెంచాల్సిందే! ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ 

Tags

Related News

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు బిగ్ షాక్.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై BCI స్టే!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై ఈటల రాజేందర్‌ సంచలన నిర్ణయం.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర!

కారు అద్దె బకాయి వివాదంలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!

సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

Big Stories

Advertisement
×